గుంటూరు జిల్లా (రేపల్లె)
టీడీపీ శాసనసభ్యులు, శ్రీ అనగాని సత్యప్రసాద్ పత్రికా ప్రకటన వివరాలు..
వైసీపీ నాయకులు బ్యాంకుల ముందు చెత్త వేయడం కాదు.. బీసీ నాయకులు విగ్రహాలు తీసేస్తామన్న మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి.
– నివాసయోగ్యం కాని ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ రెడ్డి, మంత్రుల ఇళ్ల ముందు వేయాలి.
– సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని మంత్రి అప్పల రాజు అనడం దుర్మార్గం
★ అక్రమ రుణాలు ఇవ్వలేదని వైసీపీ నేతలు బ్యాంకుల ముందు చెత్త వేయడం కాదు.. బీసీ నాయకులు విగ్రహాలు లేకుండా చేస్తామన్న మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి.
★ నివాసయోగ్యం కాని ఇళ్ల స్థలాలు ఇస్తున్న జగన్ రెడ్డి, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి.
★ రాష్ట్రంలో బీసీలను జగన్ రెడ్డి ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ అవమానించేలా వ్యవహరిస్తోంది.
★ బీసీలంటే లెక్కలేనితనంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంది.
★ పదవుల్లో బీసీలకు ఒట్టి చేతులు చూపుతున్నారు.
★ బీసీలకు అందే సంక్షేమ పథకాలకు కోత పెట్టారు.
★ స్వాతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న విగ్రహంపై మంత్రి సీదిరి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం.
★ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థలం వివాదంలో లేదని, ఆ స్థలం తనదేనని యజమాని పాపారావు ఒప్పుకున్నారు.
★ ఉన్నత చదువు చదివి అబద్ధాలు ఆడటానికి అప్పలరాజుకు సిగ్గుండాలి.
★ లచ్చన్న విగ్రహానికి పాలాభిషేకం చేసిన వైసీపీ నాయకులు అప్పల రాజు వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు.?
★ కులం బురదలో వైసీపీ నాయకలు కొట్టిమిట్టాడుతున్నారు.
★ దమ్ముంటే లచ్చన్న విగ్రహం మీద అప్పలరాజు చెయ్యి వెయ్యాలి.
★ మంత్రి పదవి వచ్చాక కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు.
★ లచ్చన్న గురించి మీకు ఏం తెలుసు అప్పల రాజు?
★ గౌతు లచ్చన్న అంటే దేశంలోనే పేరుగాంచిన వ్యక్తి.
★ కానీ శ్రీకాకుళంలో పుట్టిపెరిగిన మీకు ఆయన గొప్పతనం తెలియకపోవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం.
★ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను విచ్చల విడిగా అనుమతి లేకుండా రాష్ట్రంలో పెట్టారు.
★ బీసీ వర్గాలకు చెందిన నాయకుల విగ్రహాలు రాష్ట్రంలో ఉండకూడదా?
★ అప్పల రాజు వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించకపోవడం బీసీ వర్గాలను అవమానించడమే.
★ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ఏదైనా అయితే క్షణాల మీద స్పందించే జగన్ రెడ్డి లచ్చన్న విగ్రహాన్ని మంత్రి తీసేస్తామంటే ఎందుకు మెదలడం లేదు?
★ రాగద్వేషాలు, భయం పక్షపాతాలు లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తాని రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని అటకెక్కించారు.
★ ప్రతిపక్షాలను, ప్రజలను, గిట్టని వారిని రాచి రంపాన పెడుతుంది వాస్తవం.
★ ఇచ్చిన హామీలన్నీ ఎలా పల్టీలు కొట్టాయో కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నా గొప్ప ప్రకటనలకు మాత్రం కొదవరానివ్వడం లేదు.
★ నేరం చేయకపోయినా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు.
★ నేరం చేసినట్లు అన్ని సాక్ష్యాలున్నా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రం కేసులుండవు.
★ జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారమే దళితులు, మహిళలపై దాడులు గణనీయంగా పెరిగాయి.
★ దళిత, బీసీ, మైనార్టీలపై దాడులు చేసినా, మహిళలపై దురాగతాలకు పాల్పడినా, శిరోముండనాలు చేసినా చర్యలుండవు.
★ దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
★ బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి దాపురించింది.
★ ఇండియన్ ఫీనల్ కోడ్[ఐపిసి]ని వైసీపీ ఫీనల్ కోడ్ గా మార్చారు.
★ రాజ్యాంగాన్ని, దానిపై చేసిన ప్రమాణాన్ని కాలరాశారు.
★ ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులను రాష్ట్రంలో నుజ్జు నుజ్జు చేశారు.

