Tuesday, March 9, 2021

టీడీపీ శాసన సభ్యులు, శ్రీ మంతెన రామరాజు పత్రికా ప్రకటన

పశ్చిమగోదావరి జిల్లా (ఉండి)

టీడీపీ శాసన సభ్యులు, శ్రీ మంతెన రామరాజు పత్రికా ప్రకటన వివరాలు..

మూడు రాజధానుల మిధ్యతో ప్రజలను వంచిస్తున్నారు.

– రాజధాని వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి శూన్యం

★ రాజధానిని విచ్ఛిన్నం చేయడానికే మూడు రాజధానులంటూ డ్రామాలాడుతున్నారు.

★ జగనాసుర పాలన అంతానికి అమరావతి నుండే నాంది అయింది.

★ రాష్ట్ర భవిష్యత్తు అయిన రాజధానిపై కులతత్వాన్ని రెచ్చగొట్టి ఏం మూటకట్టుకున్నారు.?

★ అసత్యాలు ప్రచారం చేసి రాష్ట్రాభివృద్ధిని నాశనం చేశారు.

★ 397 రోజులగా రైతులు చేస్తున్న ఉద్యమం మాటల్లో చెప్పలేనిది.

★ గాంధీ మార్గంలో పోరాడుతున్న దళిత రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టడం ఎక్కడా లేదు.

★ రైతులు చేస్తున్న ఉద్యమం ముందు కృత్రిక ఉద్యమాలు తట్టుకోలేవు.

★ రాజధాని విషయంలో తప్పు చేశామా? అని తల పట్టుకునే రోజు వైసీపీకి వస్తుంది.

★ అభివృద్ది వికేంద్రీకరణ ముసుగుతో రాజకీయ క్రీడలో రాజధాని బలిచేయ్యడం సిగ్గుమాలిన చర్య.

★ పలానా నగరం మా రాజధాని అని చెప్పుకునే పరిస్థితి లేకుండా వైసీపీ చేసింది.

★ మూడు రాజధానుల అభివృద్ది వికేంద్రీకరణ ఎండమావిలో నీటి వంటిదే.

★ కక్షసాధింపులు రాష్ట్రానికి మంచిది కాదు.

★ చంద్రబాబుతో ఉన్న రాజకీయ విభేదాలకు ప్రాధాన్యతనిచ్చి రాష్ట్ర ప్రయోజనాలు బలిపెడుతున్నారు.

★ రాజధాని నుండి ఆదాయం సమకూరితే రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయన్న విషయం పాలకులు గ్రహించాలి.

★ రాజధాని శంకుస్థాపనకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చర్చిలు, దేవాలయాలు, మసీదుల నుండి మట్టిని తెచ్చారు. కానీ జగన్ రెడ్డి ప్రజల ఇష్టాన్ని పక్కన పెట్టారు.

★ అభివృద్ధి వికేంద్రీకరణ చేసిన ఏకైక పార్టీ టీడీపీ.

★ అభివృద్ధిలో వైసీపీ పోటీపడలేక ప్రాంతీయ, కుల విధ్వేశాలు రెచ్చగొడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles