Monday, March 1, 2021

టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, శ్రీ బుచ్చి రాంప్రసాద్ పత్రికా ప్రకటన

అమరావతి

టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, శ్రీ బుచ్చి రాంప్రసాద్ పత్రికా ప్రకటన వివరాలు..

రాష్ట్రంలో ఒక మతాన్ని కించపరిచే చర్యలు సరికావు

– హిందూ ఆచారాలపై కుట్రపూరితంగా దాడి జరుగుతోంది

– తిరుమల వైకుంఠ ద్వార దర్శనం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం

– ప్రతి రోజూ హిందూ దేవాలాయాలపై దాడులు

★ జగన్ రెడ్డి 18 నెలల పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయి.

★ తిరుపతి దగ్గర నుంచి శ్రీశైలం వరకు పెద్ద పెద్ద దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతోంది.

★ టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి తిరుమల కొండపై, ద్వారకా తిరుమలలోనూ వైకాపా నేతలు, మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జగన్ రెడ్డి విధానాలకు నిదర్శనం.

★ తిరుమలకు వెళ్లే బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత కీర్తనలు పెట్టారు.

★ నేడు తిరుమల వైకుంఠ దర్శనం విషయంలో మూడు రోజులు కొనసాగించే దర్శనాన్ని 10 రోజులు పాటు పెట్టారు.

★ హిందూ గౌరవాలపై పద్ధతి ప్రకారం ఈ ప్రభుత్వం దాడి చేస్తోందని దీనిని బట్టి అర్థమవుతోంది.

★ ప్రతి రోజూ హిందూ దేవాలయాలపై ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది.

★ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.

★ దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది.

★ తిరుమలలో వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి 5,6 వందల మందితో దర్శనానికి వెళ్లారు.

★ డ్రోన్ లు ఎగురవేసి తిరుమల నిబంధనలు ఉల్లంఘించారు.

★ ఇది శాంతిభద్రతలకు విఘాతం కాదా? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?

★ కనీసం మాస్క్ లు కూడా వేసుకోకుండా ర్యాలీగా వెళ్లారు.

★ ప్రకాశం జిల్లా దర్శిలో కృష్ణుడి ఆలయంలో రక్తం, మాంసపు ముక్కలు పడేసి వెళ్లారు.

★ ద్వారకా తిరుమలలో పందిమాంసం అమ్మే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

★ ఇవన్నీ దేనికి సంకేతం? ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.

★ అంతర్వేది రథం దగ్ధం చేసినా చర్యలు లేవు.

★ చర్చిలో దాడి జరిగిందని చెప్పి 24 గంటల్లో అరెస్ట్ చేశారు.

★ సంఘటనలు చూసేందుకు వెళ్లే వారిని కూడా అనుమతించడం లేదు.

★ కనకదుర్గ గుడిలో వెండి సింహాలు మాయం అయ్యాయి.

★ హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు.

★ రోడ్లపైకి రాకపోయినా సరైన సమయంలో బుద్ధి చెబుతారు.

★ ఓ మతంపై పథకం ప్రకారం దాడి చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు.

★ మత మార్పిడులు, దాడుల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ పోరాటం చేస్తుంది. త్వరలోనే కార్యాచరణ వెల్లడిస్తాం.

★ ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, అంతర్వేది రథం దగ్ధంపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు, దేవాదాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు మనం చూశాం.

★ జగన్ రెడ్డి ఏనాడూ స్పందించలేదు.

★ బ్రాహ్మణులపై దాడులు జరుగుతున్నాయి.

★ అన్ని వర్గాలను, మతాలను గౌరవించే సంప్రదాయం నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

★ ఒక మతాన్ని కించపరిచే చర్యలు సరికావు.

★ ఇది అంతర్యుద్ధానికి దారి తీస్తుంది.

★ ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్లు తెరిచి సమస్యలు పరిష్కరించాలి.

★ లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles