Monday, March 8, 2021

టీయన్‌టియుసి అధ్యక్షులు శ్రీ గొట్టుముక్కల రఘురామరాజు పత్రికా ప్రకటన

అమరావతి

టీయన్‌టియుసి అధ్యక్షులు, శ్రీ గొట్టుముక్కల రఘురామరాజు పత్రికా ప్రకటన వివరాలు..

పోలవరం ప్రాజెక్టు వద్ద విగ్రహాలు కాదు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వండి

★ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాత్రింబవళ్లు పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు 16 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వేధించడాన్ని తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ తీవ్రంగా ఖండిస్తోంది.

★ ఈ సంఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు డిసెంబర్‌ 15న టీయన్‌టీయుసి అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో పోలవరం పర్యటన చేపట్టడం జరిగింది.

★ పోలవరం ప్రాజెక్టు సందర్శించిన ముఖ్యమంత్రి కార్మికులకు వేతనాలు అందుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత లేదా?

★ ఒక్కరోజు కూడా నీటిపారుదల శాఖామంత్రి పట్టించుకోలేదు.

★ బూతులు తిట్టడంలో పోటీపడే మంత్రులు ఉద్యోగులకు వేతనాలు అందించడంపై శ్రద్ధ చూపించడంలేదు.

★ ప్రభుత్వానికి, ప్రజలకు ఎటువంటి ఉపయోగంలేని సలహాదారుకు కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తున్న ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి చేతులు రావడం లేదా?

★ కార్మిక సంఘాలు వేతనాల పెండింగుపై మంత్రికి విజ్ఞప్తులు ఇచ్చినా కానీ పట్టించుకోలేదు.

★ పోలవరం నిర్మాణ చరిత్రలో వేతనాలు ఇవ్వలేదని ఒక్కరోజైనా కార్మికులు రోడ్డెక్కిన దాఖలాలు ఉన్నాయా?

★ కార్మికులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారా?

★ కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న జగన్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉన్నాయి.

★ ప్రభుత్వం 24 గంటలలోపు కార్మికుల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని టీయన్‌టియుసి డిమాండ్‌ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles