తంబళ్ళపల్లి బయలుదేరిన పులివర్తి నాని హౌస్ అరెస్ట్

టీడీపీ నేతలపై దాడి చేసి వాహనాలనూ ధ్వంసం చేయటాన్ని సీరియస్ గా తీసుకున్న ఆ పార్టీ నేతలు ఛలో తంబళ్ళపల్లి కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయం తంబళ్ళపల్లి బయలుదేరిన చిత్తూరు పార్లమెంట్ నియోజక వర్గ అధ్యక్షులు శ్రీ పులివర్తి నాని గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా శ్రీ పులివర్తి నాని గారు మాట్లాడుతూ తంబళ్ళ పల్లి నియోజకవర్గం అంగళ్ళులో టీడీపీ నేతలపై జరిగిన సంఘటన రాష్ట్రంలో వైసీపీ రౌడీ పాలన చేస్తోందనటానికి నిదర్శనం అన్నారు. టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తల పరామర్శకు వెళుతున్న టీడీపీ నేతలపై వైసీపీ గూండాలు దాడి చేయటం సిగ్గు చేటన్నారు. దాడి చేసిన వారిని వదిలేసి గాయపడిన వారిని అరెస్టు చేయటం ఏ చట్టంలో ఉందో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.