అమరావతి
తుర్లపాటి కుటుంబరావు మృతిపట్ల తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు సంతాపం
★ ప్రముఖ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
★ సీనియర్ పాత్రికేయునిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి సేవలు శ్లాఘనీయం.
★ పద్మశ్రీ, కళాప్రపూర్ణ తదితర అనేక పురస్కారాలే తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలు.
★ ఆయన మృతితో బహుముఖ ప్రజ్ఞావేత్తను రాష్ట్రం కోల్పోయింది.
★ తుర్లపాటి కుటుంబరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
★ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.