Thursday, February 25, 2021

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు లేఖ

అమరావతి/తూర్పుగోదావరి జిల్లా

గౌరవనీయులైన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు లేఖ

అనపర్తి గ్రామంలో కర్రి అరుణ కుమారి అనే మహిళ బలవన్మరణానికి కారకులైన అనపర్తి ఎమ్మెల్యేపై చర్యల కొరకు

‘‘ఓటేసి గెలిపించినందుకు మంచి పని చేశారు. మేము వాడుకునే రోడ్డును కూడా మూసివేశారంటూ’’ తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన కర్రి అరుణ కుమారి అనే వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం.

★ తాము అధికారంలోకి వస్తే తమ వీధికి సిమెంట్ రోడ్డు వేయిస్తానని డా. సూర్యనారాయణ రెడ్డి 2019 ఎన్నికల్లో హామీనిచ్చారని నేడు ఇచ్చిన హామీకి కట్టుబడకుండా మాట తప్పారని అరుణకుమారి ఆవేదన చెందటం లేఖలో సుస్పష్టంగా ఉంది.

★ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రజలకు ఇష్టానుసారంగా వాగ్దానాలు ఇచ్చి నమ్మించి ఓట్లు దండుకొని నేడు నట్టేట వైసీపీ నాయకులకు అలవాటుగా మారింది.

★ కర్రి అరుణకుమారి ఆత్మహత్య ముమ్మాటికి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బాధ్యత వహించాలి.

★ ఇటువంటి ఘటనలు మరో సారి పునరావృతం కాకుండా అనపర్తి శాసనసభ్యునిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

★ లేకుంటే ఇలాంటి సంఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

★ ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశంలోను ప్రజలనే కాదు వైసీపీ కార్యకర్తలను సైతం మోసం చేస్తూ వచ్చింది.

★ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలకు ఇప్పటికే అనేక మంది వైసీపీ కార్యకర్తలు, ప్రజలు బహిరంగంగా భయటకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

★ వెంటనే చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

👉 కాపీ టు:

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మంగళగిరి

సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles