అమరావతి (కడప జిల్లా/పులివెందుల)
తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
న్యాయం చేయాలని అడిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గం
– టీడీపీ నేతలపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
★ పరిపాలన చేతకాకపోయినా అక్రమ కేసులకు కొదవ లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.
★ పులివెందులలో హత్యకు గురైన దళిత మహిళ కేసులో దోషులను శిక్షించాలని ఆందోళన చేసిన తెదేపా నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం దుర్మార్గం.
★ ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా తయారవుతున్నాయి.
★ మనం రాచరికంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా?
★ ఎస్టీ, ఎస్సీలను రక్షించుకోవడానికి ఉన్న చట్టాలను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
★ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ విధంగా అపహాస్యం చేస్తే అమలయ్యేది రాజారెడ్డి రాజ్యాంగం అనక మరేమనాలి?
★ నిందితులను అరెస్టు చేయాలని అడగడం తప్పా.?
★ ఏ నేరం చేశారని నిరసనకారులపై అట్రాసిటీ కేసులు పెట్టారు.?
★ శాంతియుత ప్రదర్శనలు, నిరసనలు జరిపే ప్రాధమిక హక్కు రాజకీయ పార్టీలకు, ప్రజలకు వుంది.
★ నిరంకుశంగా వ్యవహరించి హక్కును కాలరాసే విధంగా నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం.
★ ప్రజల పక్షాన ప్రశ్నించడం నేరంగా, ప్రజా వ్యతిరేక చర్యల పై పోరాడటం ఘోరంగా, ప్రజల హక్కులు పరిరక్షణకు పూనుకోవడం ద్రోహంగా భావించి కేసులు బనాయించడం జగన్ రెడ్డి పాసిష్టు పాలనకు నిదర్శనం.
★ వైసీపీ నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలను హతమార్చినా, శిరోముండనాలు చేసినా, దాడులు చేసినా కేసులుండవు.
★ న్యాయం కోసం పోరాడిన వారిపై మాత్రం అరక్షణంలో అక్రమ కేసులు పెడుతున్నారు.
★ ఈ విధానాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం మానుకోకపోతే ప్రజలు ఏమాత్రం క్షమించరు.
★ టీడీపీ నేతలపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.