అమరావతి
తెదేపా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
కోదండ రాముడి విగ్రహం ధ్వంసం హిందూ మతంపై దాడే
– జగన్ రెడ్డి పాలనలో రోజుకో దేవాలయంలో విగ్రహాల ధ్వంసం
– 19 నెలల పాలనలో 126 దాడులు
– తిరుమల పవిత్రతను మంటగల్పుతున్నారు
★ భారతదేశ చరిత్రలో ఇంతవరకు దేవాలయాలపై ఎప్పుడూ ఇలాంటి దాడులు, విధ్వంస ఘటనలు జరగలేదు.
★ మొట్టమొదటి సారిగా జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్నాయి.
★ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై జరిగిన దాడులు, విధ్వంసాలపై తెలుగుదేశం పార్టీ లిస్ట్ ను విడుదల చేయడం జరిగింది.
★ నూతన సంవత్సరం ఎవరైనా ఆనందోత్సవాలతో ప్రారంభిస్తారు.
★ కానీ రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం ధ్వంసంతో నూతన ఏడాది ప్రారంభమైంది.
★ ప్రజల నుంచి నిత్యం పూజలు అందుకునే విగ్రహాలపై దాడులు జరగడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది.
★ దేవాలయాల భూములపై, మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులపై, టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఉన్న శ్రద్ధ దేవాలయాల పరిరక్షణపై ఎందుకు లేదు?
★ 19 నెలల్లో 126 దాడులు జరిగితే ముఖ్యమంత్రి వెళ్లి ఎందుకు పరిశీలించలేదు?
★ ఒక్క రోజు కూడా కేబినెట్ లో ఎందుకు చర్చించలేదు?
★ ఒక్క మంత్రి కూడా ఎందుకు ఇంతవరకు సంఘటనా స్థలాలకు వెళ్లలేదు?
★ అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరుపుతామని హామీ ఇచ్చి ఎందుకు జరపలేదు?
★ ఓ వైపు దేవాదాయ శాఖ నిధులు దారిమళ్లిస్తూ.. మరో వైపు ఆస్తులు అన్యాక్రాంతం చేస్తున్నారు.
★ విద్వేషం, విధ్వంసం తప్ప దేవాలయాల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా?
★ ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం దేవాలయాలపై దమన కాండ జరుగుతోంది.
★ ఎవరి సహకారంతో ఈ దాడులు జరుగుతున్నాయి?
★ రాష్ట్రంలో ప్రజలకే కాదు.. దేవుళ్లకూ ఈ రాష్ట్రంలో రక్షణ లేదు.
★ తెలుగుదేశం హయాంలో మతసారస్యాన్ని కాపాడాం.
★ ఎక్కడ ఇలాంటి విధ్వంసం ఘటనలు చోటుచేసుకోలేదు.
★ 19 నెలల నుంచి రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట దేవాలయాలపై దాడులు, విధ్వంసం జరుగుతూనే ఉన్నాయి.
★ ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని జగన్ రెడ్డి పాలనలో దుండగలు రెచ్చిపోతున్నారు.
★ దేవాలయాల భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?
★ ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
★ తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారు.
★ ఇది ముమ్మాటికీ హిందూ మతంపై దాడే.
★ ఆలయం పక్కనే ఉన్న మడుగులో విగ్రహం శిరస్సు భాగం లభించింది.
★ హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా జగన్ రెడ్డి నిన్న స్పందించడం ఏమిటి?
★ రామతీర్థం ఘటనకు జగన్ రెడ్డి బాధ్యత వహించాలి.
★ ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి, దోషులను కఠినంగా శిక్షించాలి.
★ పిఠాపురంలో 6 దేవాలయాల్లో 23 విగ్రహాల ధ్వంసం, గుంటూరులో దుర్గమ్మ ఆలయం కూల్చివేత, సింహాద్రి అప్పన్న గుడిలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో, శ్రీశైలంలో, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారాలకు పాల్పడుతున్నారు.
★ అంతర్వేది, బిట్రగుంట రథం దగ్ధం, దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైనా ఇప్పటివరకు చర్యలు లేవు.
★ అన్యమత ప్రచారాల ద్వారా ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు.
★ పరిపాలన చేతగాక కులాలవారీగా, మతాల వారీగా చిచ్చుపెట్టి ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు.
★ చర్చి మీద దాడి చేస్తే, నిమిషంలో 40 మందిని అరెస్ట్ చేస్తున్నారు.
★ కానీ ఒక మతంపైన మాత్రమే దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
★ విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్ రెడ్డి ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలువబడే రామతీర్ధం ఎందుకు సందర్శించలేదు? ఎందుకు స్పందించలేదు?
★ విజయనగరం జిల్లా ఇన్ ఛార్జ్ గా దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి ఉంటే, అక్కడే హిందు దేవాలయాలకు రక్షణ లేదు.. అక్కడ ఎందుకు వెల్లంపల్లి పర్యటించలేదు?
★ వెండి సింహాలు మాయమైతే ఎవరికి నష్టం, అంతర్వేది రథం దగ్ధమైతే కొత్తది చేయిస్తాం, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం అయితే.. ఆంజనేయస్వామికి ఏం నష్టం అంటూ మంత్రి కొడాలి నాని ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలపై ఆనాడే కఠినంగా చర్యలు తీసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు.
★ అయోధ్యలో రామాలయం శంకుస్థాపనను ఎస్వీబీసీ ఛానల్ ప్రచారం చేయనప్పుడే మీకు రాముడుపై ఉన్న గౌరవం తెలిసింది..
★ రామతీర్థంలో ఘటనపై మౌనం వహించడం కూడా మీ చిత్తశుద్ధిలేమికి నిదర్శనం.
★ ప్రభుత్వ వైఖరితోనే ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా పునరావృతం అవుతున్నాయి.
(ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడుల జాబితా జతపరచమైనది.)