కడప జిల్లా (రాయచోటి)
తెదేపా శాసనమండలి సభ్యులు, శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి పత్రికా ప్రకటన వివరాలు..
పెళ్లి పేరుతో ఎస్టీ యువతి ప్రియాంకను మోసం చేసిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.
– నిందితులకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అండగా ఉండటం సిగ్గుచేటు
– రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ లేదు.
★ రాయచోటి పట్టణం, లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న ఎస్టీ వర్గానికి చెందిన పూజారి వెంకటేశ్వర్లు కుమార్తె ప్రియాంకను రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు శంకర్ రెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.
★ అవమానాన్ని తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ప్రియాంక కోమాలోకి వెళ్లింది.
★ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రియాంకకు ఇప్పటి వరకు వైద్య ఖర్చులు రూ.20 లక్షలు అయ్యాయి.
★ ప్రియాంక వైద్య ఖర్చులకు తక్షణమే ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలి.
★ ఘటన జరిగి నాలుగు నెలలు అవుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించకపోవడం దారుణం.
★ పెళ్లి చేసుకుని వచ్చాక మళ్లీ పెళ్లి చేస్తామని మాయ మాటలు చెప్పి ప్రియాంక మెడలో తాళిని తెంపించారు.
★ దీనిపై వెంకటేశ్వర్లు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినా సీఐ రాజు కేసు నమోదు చేయకుండా అవమానకరంగా మాట్లాడారు.
★ పులివెందుల జేఎన్టీయూలో ఇంజనీరింగ్ ద్వితియా సంవత్సరం చదువుతున్న ఎస్టీ యువతి ప్రియాంక జీవితాన్ని రాజశేఖర్ రెడ్డి నాశనం చేశారు.
★ రాజశేఖర్ రెడ్డిని రక్షించడానికి కేసు నమోదు చేయకుండా పోలీసులపై ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒత్తిడి చేశారు.
★ తక్షణమే వైసీపీ అదిష్టానం శ్రీకాంత్ రెడ్డిని, శంకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిని వైసీపీ నుండి సస్పెండ్ చేయాలి.
★ రోజుకో మహిళ రాష్ట్రంలో రోధనకు గురవుతోంది.
★ మొన్న పులివెందులో దళిత మహిళను హత్య చేశారు.
★ ఇప్పుడు ప్రియాంకను పెళ్లి పేరుతో మోసం చేశారు.
★ వారంలోనే కడప జిల్లాలో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి.
★ ప్రియాంకకు న్యాయం చేసే వరకు టీడీపీ పోరాడుతుంది.
