Tuesday, March 2, 2021

తెదేపా శాసనమండలి సభ్యులు, శ్రీ బుద్ధా నాగజగదీశ్వరరావు పత్రికా ప్రకటన

విశాఖపట్నం జిల్లా

తెదేపా శాసనమండలి సభ్యులు, శ్రీ బుద్ధా నాగజగదీశ్వరరావు పత్రికా ప్రకటన వివరాలు..

రాష్ట్రంలో పెట్టుబడి సదస్సులు పోయి.. పేకాట శిబిరాలు వచ్చాయి.

– సీఎంకు చిత్తశుద్ధి ఉంటే కొడాలి నానిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి

★ పెట్టుబడి సదస్సులు జరగాల్సిన రాష్ట్రంలో పేకాట శిబిరాలు నిర్వహించడం సిగ్గుచేటు.

★ పేకాట శిబిరాలు నిర్వహించడమే కాకుండా ఆడిస్తే ఏమౌతుందని మంత్రి కొడాలి నాని మాట్లాడటం బాధ్యతారాహిత్యం.

★ రాష్ట్రంలో ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ రద్దు చేసి బహిరంగ గ్యాంబ్లింగ్ కు అనుమతులు ఇచ్చారు.

★ జగన్ అనే నేను అని గొంతు చించుకుని అరవడం కాదు.. తప్పులు జరిగనప్పుడు వచ్చే స్పందన కావాలి.

★ గతంలో ఉండవల్లి శ్రీదేవి కూడా పేకాడ ఆడిద్దామని చెప్తే ఇప్పటి వరకు చర్యలు లేవు.

★ సన్ రైజ్ రాష్ట్రాన్ని కాస్త గ్యాంబ్లింగ్ రైజ్ రాష్ట్రంగా మారుస్తున్నారు.

★ ఇప్పుడు కొడాలి నాని ఆడితే తప్పేంటి? ఉరిశిక్ష వేస్తారా? అని లెక్కలేని తనంగా మాట్లాడుతున్నారు.

★ ఇప్పుడు పట్టుకున్నా మళ్లీ ఎక్కడో ఒకచోట ఆడుకుంటారని జూదరులకు కొడాలి నాని భరోసా ఇస్తున్నారు.

★ జేబులు నింపుకోవడానికి పేకాట శిబిరాలు నిర్వహించి ప్రజలను జూదంలోకి లాగుతున్నారు.

★ ఈ పేకాట నిర్వహణపై విచారణ చేసి నిర్వాహకులు మీద చర్యలు తీసుకోవాలి.

★ రాష్ట్రంలో అడ్డగోలుగా క్రికెట్ బెట్టింగులు, పేకాట క్లబ్బులు రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు.

★ జూదాల వల్లే రాష్ట్రంలో నేరాల ఉదృతి పెరుగుతోంది.

★ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా జూదాల్లో వచ్చే ఆదాయంలో వాటాలున్నాయి.

★ వాటాల్లో తేడాలు రాబట్టే పేకాట నిర్వహణ బహిర్గతం అయింది.

★ రాష్ట్రానికి ఉన్న బ్రాండింగ్ ను సర్వనాశనం చేశారు.

★ ఇంత జరిగినా జగన్ రెడ్డి స్పందించకపోవడం దారుణం.

★ జూదాలను నిర్వహించి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు.?

★ వైసీపీ నేతల తీరును ప్రజలు చీదరించుకుంటున్నారు.

★ దాడులు, జూదాలు, అరెస్టులు, అరాచకాలు, హత్యలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles