అమరావతి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు
– ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎస్సీనా? ఎస్టీనా?
★ అసైన్డ్ భూములను రైతుల ఆమోదంతో తీసుకుని రాజధాని కోసమే ఉపయోగించాము.
★ దేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారా?
★ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, ఎస్టీనా?
★ ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఏ విధంగా కేసు పెడతారు?
★ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
★ రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చాము.
★ ల్యాండ్ పూలింగ్ 2015లో జరిగితే దానిపై ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపుకాదా?
★ జగన్ రెడ్డి నేటికీ సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములు వాడుకుంటున్నారు.
★ అసైన్బ్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న చరిత్ర జగన్ రెడ్డిది.
★ ఇళ్ల స్థలాల పేరుతో వందలాది మంది అసైన్డ్ భూములను లాక్కున్నారు.
★ దశాబ్ధాలు తరబడి ఇడుపులపాయలో అసైన్డ్ భూములు వాడుకుంటన్న చరిత్ర జగన్ ది.
★ వాన్ పిక్ భూములు లాక్కుని రైతులకు పరిహారం ౾నేటికీ ఇవ్వలేదు.
★ రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
★ రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ను చేపట్టాం.
★ ఎక్కడా సొంత ప్రయోజనాల కోసం తీసుకోలేదు.
★ రైతుల అనుమతితోనే ఆ భూమలు సేకరికంచడం జరిగింది.
★ సోలార్ కంపెనీలు అవసరాలకు అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చిన విషయం వాస్తవం కాదా?
★ పేదలు ఎంతో కాలం నుండి సాగుచేసుకొంటున్న అసైన్దు భూములను దౌర్జన్యంగా గుంజుకొని ఇళ్లస్థలాలు ఇస్తున్నారు.
★ ఇడుపులపాయలో అసైన్డ్ భూములు 700 ఎకరాలను 30 ఏళ్లు అనుభవించారు.
★ ఆ విషయం బయటపడటంతో 610 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నానని అసెంబ్లీలో వై.ఎస్. చెప్పారు.
★ ఆ తరవాత 300 ఎకరాలే స్వాధీనం చేస్తున్నానని మాట మార్చలేదా?
★ అసైన్డు భూముల బదిలీ నిషేధ చట్టాన్ని 2007లో సవరించి ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తెచ్చింది మీతండ్రి వైఎస్. కాదనగలరా?
★ ఫలితంగా పేదల భూములు లాక్కొని తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టుకొనే వీలు కలిగించగలిగారు.
