తెలుగువారందరికీ కీ.శే. పొట్టి శ్రీరాములు ఆదర్శం – మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
విజయవాడ రూరల్, గొల్లపూడి – డిసెంబర్ 15
ఆంధ్రరాష్ట్ర అవతరణకై అమరుడైన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని పురస్కరించుకొని గొల్లపూడి కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం మద్రాస్ లో ఉన్న తెలుగు వారందరికీ ఒక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి డిసెంబర్ 15 రాత్రి ఈ ప్రాణ త్యాగం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఆంధ్రులకు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన చేసిన ప్రాణత్యాగం వల్ల అప్పటి ప్రధాని జోహార్ లాల్ నెహ్రూ గారు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వాతంత్ర సమరయోధుడు గాంధీ గారి అనుచరుడుగా ఎన్నో ఉద్యమాల్లో పాలుపంచుకున్నారని, ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఈ మహానుభావుడే కారణమని, ఆయన పేరుమీద గుర్తుగా నెల్లూరు జిల్లా కి కూడా ఆయన పేరు పెట్టుకోవడం జరిగిందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఆయన పేరు పెట్టుకోవడం తెలుగు వారందరూ కూడా ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఆయన పట్టుదల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని వారిని స్మరించుకుందామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు పాల్గొన్నారు.
