Friday, March 5, 2021

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీలు

అమరావతి

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీలు

‘‘రాక్షస పాలనలో మన ఆడబిడ్డలకేది రక్షణ’’ అంటూ టిడిపి బ్యానర్లు

– అనంతపురంలో దళిత ఆడబిడ్డపై హత్యాచారాన్ని ఖండించిన టిడిపి శ్రేణులు

– రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలపై వరుస అఘాయిత్యాలపై ధ్వజమెతిన టిడిపి

★ అనంతపురంలో దళిత ఆడబిడ్డపై హత్యాచారాన్ని ఖండిస్తూ టిడిపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 25పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో కాగడాల ర్యాలీలు నిర్వహించారు.

‘‘జగన్ రెడ్డి రాక్షస పాలనలో మన ఆడబిడ్డలకేది రక్షణ..? దళితులపై దమనకాండ ఆపాలి, గిరిజనులపై అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి, ముస్లింలపై కిరాతక చర్యలను అడ్డుకోవాలి, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలి, పేదల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని’’ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు..

‘‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం నేరగాళ్ల ఇష్టారాజ్యం…’’ నినాదాలతో హోరెత్తించారు.

★ ఈ సందర్భంగా వివిధ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కాగడాల ర్యాలీలలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి టిడిపి నాయకులు మాట్లాడుతూ..

★ దళిత ఆడబిడ్డలు, గిరిజన మహిళలు, ముస్లిం మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యం అయ్యాయని, రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కొరవడిందని ధ్వజమెత్తారు.

★ 19నెలల్లో 400పైగా అఘాయిత్యాలు ఆడబిడ్డలపై జరగడం ఏపిలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనంగా పేర్కొన్నారు.

★ బడికెళ్లిన బాలిక, కాలేజికెళ్లిన విద్యార్ధిని, మార్కెట్ కెళ్లిన మహిళ, ఉద్యోగానికెళ్లిన ఆడబిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగొస్తే చాలని కుటుంబ సభ్యులు భయపడే దుస్థితులు దాపురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

★ ధర్మవరంలో స్నేహలత, రాజమండ్రిలో దళిత మైనర్ బాలిక, బొమ్మూరులో ముస్లిం బాలిక, గురజాలలో దళిత బాలిక, దాచేపల్లిలో ముస్లిం బాలిక, నెల్లూరులో, తాడిపత్రిలో, ఆడబిడ్డలపై అత్యాచారాలను ఖండించారు.

★ బిసి,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీలపై దమనకాండను నిరసించారు.

★ బైటకెళ్లిన ఆడబిడ్డ క్షేమంగా తిరిగివచ్చే పరిస్థితులు లేకుండా పోయాయని మండిపడ్డారు.

★ వైసిపి అండ చూసుకుని నేరగాళ్లంతా ఇష్టారాజ్యంగా పేట్రేగిపోతున్నారని ధ్వజమెత్తారు.

★ దీనికి తగిన మూల్యం వైసిపి చెల్లించక తప్పదని, బాధిత ప్రజానీకమై తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

★ ఈ కాగడాల ర్యాలీలలో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వర రావు, మాజీ ఎంపి నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, పార్థసారథి, మండలి బుద్దప్రసాద్, బోడె ప్రసాద్, ఈరన్న, అయితా బత్తుల ఆనందరావు, వంగలపూడి అనిత(తెలుగు మహిళ అధ్యక్షురాలు), పల్లా శ్రీనివాస రావు(విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు), అదితి గజపతిరాజు(విజయనగరం), సుబ్బరత్తమ్మ(హిందూపురం), పరిటాల శ్రీరాం, సవిత, మహమ్మద్ నజీర్(గుంటూరు), మన్నం ప్రణవ గోపాల్(టిఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు), గంటా నూకరాజు, లోడగల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles