సామాన్య కార్యకర్త కోరిక తీర్చిన చంద్రబాబు గారు
నగరి నియోజకవర్గం విజయపురం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు అశోకన్ గారి కుమారుడు ఆల్బర్ట్ తెలుగుదేశం పార్టీ అంటే అమితంగా అభిమానించేవాడు. వారి కుటుంబం తెలుగుదేశం పార్టీకి విధేయత కల్గింది. ఆల్బర్ట్ తన వివాహంను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి సమక్షంలో జరుపుకోవాలని ఆశపడ్డాడు. అతని కోరికను నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ గారు చంద్రబాబునాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. భాను గారి విజ్ఞప్తి మేరకు వివాహ కార్యక్రమం లో చంద్రబాబునాయుడు గారు జూమ్ వీడియో కాల్ ద్వారా ఈరోజు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఆశీర్వాదం అందుకున్న దంపతులకు మరియు ఆ కుటుంబం ఆనందానికి హద్దుల్లేవు..
