Sunday, March 7, 2021

తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు శ్రీమతి తలశిల స్వర్ణలత గారి మీడియా సమావేశం

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దళిత మహిళపై హత్యాచారం జరిగితే వైసిపి మహిళా నేతలు ఎందుకు స్పందించరు అని ప్రశ్నించారు, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు శ్రీమతి తలశిల స్వర్ణలత_

సోమవారం మచిలీపట్నంలోని, పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన, పత్రికా సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు శ్రీమతి తలశిల స్వర్ణలత మాట్లాడుతూ__

నిత్యం ఆడబిడ్డల పై అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా హోం మంత్రి, మహిళా కమిషనర్ చైర్ పర్సన్, వైసిపి మహిళా నేతలు ఏం చేస్తున్నారు?

వైసీపీ లోని మహిళా నేతలు టోల్ గేట్ల వద్ద దౌర్జన్యం చేయడం మానేసి, ఆడబిడ్డల పై చెయ్య వేసే వారి కాలర్ పట్టుకోవాలి అన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో కి వచ్చాక ఏపీని అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా మార్చారని,
వైసీపీ పాలనలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులే అందుకు రుజువని అన్నారు.

18 నెలల జగన్ మోహన్ రెడ్డి పాలన లో అధికారిక లెక్కల ప్రకారమే, రాష్ట్రంలో రోజూ
ఏదో ఒక చోట మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ చట్టం రూపం దాల్చక ముందే పోలీస్ స్టేషన్ లు పెట్టారు. మహిళను ముట్టుకుంటే మరణ శిక్ష అంటూ ఉదర కొట్టారు. అంతిమంగా మహిళలకు జరిగిన మంచి ఏమిటి?

ఇటువంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్న చట్టాల పేరు చెబుతూ కాలయాపన తప్ప ఏడాదిన్నర కాలంలో ఒక్క మృగాడికైన శిక్ష పడిందా?

నిందితుల్ని ఇలాగే వదిలేస్తే సభ్య సమాజంలో హింసాప్రవృత్తి పేచ్చు మీరు తుంది. సమాజం, ప్రభుత్వం అంటే భయం తగ్గుతుంది అన్నారు.

పులివెందుల దారుణాన్ని బయటకి రాకుండా చేయడానికి వైకాపా ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి అన్నారు.

కేవలం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పై మచ్చ రాకుండా ఉండేందుకు,
నేరస్తులను రక్షించాలని చూడటం, దోషులను కాపాడే ప్రయత్నం చేయడం దుర్మార్గం అన్నారు.

ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి, శ్రీమతి పైడి పాముల కృష్ణకుమారి, తెలుగు మహిళ మచిలీపట్నం అధ్యక్షురాలు శ్రీమతి లంకిశెట్టి నీరజ, తెలుగు మహిళలు, శ్రీమతి పాలపర్తి పద్మజ, శ్రీమతి సమయ పర్వీన్, శ్రీమతి అసిలేటి నిర్మల, శ్రీమతి హరి కుసుమ, ఎం శ్రీదేవి, ఎం ప్రమీల, ముంతాజ్ బేగం, ఎం వసంత తదితర తెలుగు మహిళలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles