అమరావతి/పులివెందుల
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ మద్దిపాటి వెంకటరాజు పత్రికా ప్రకటన వివరాలు..
“చలో పులివెందుల” కార్యక్రమంతో నీ అడ్డాలో అడుగుపెట్టి సత్తా చూపించాం
– దళితుల ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు?
★ “చలో పులివెందుల” కార్యక్రమంతో నీ అడ్డాలో అడుగు పెట్టి మా సత్తా ఏంటో చూపించాము జగన్ రెడ్డి.
★ దళితుల మీద జరుగుతున్న దాడులు, మహిళల మాన, ప్రాణాలకు వాటిళ్లుతున్న నష్టాన్ని ఆపకపోతే ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలుగుదేశం పార్టీ జెండాను నీ పులివెందుల గడ్డమీద ఎగురవేస్తాం.
★ మీ అరాచకాలకు స్వస్తి చెప్పకపోతే దళితుల ఓట్లతో మా సత్తా ఏంటో చూపించే రోజులు మీకు త్వరలోనే రాబోతున్నాయి.
★ మీరు అధికారంలోకి అడుగుపెట్టిన నాటి నుండి మా దళితులకు ఆత్మరక్షణలో పడ్డారు.
★ దళితుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే హక్కు మీకెవరు ఇచ్చారు.?
★ అధికారం కోసం దళిత జపం చేసిన మీరు నేడు వాళ్లు లేకుండా చేయాలనే కుట్ర ఏ మాత్రం సబబు కాదన్న విషయం గుర్తుంచుకుంటే బాగుంటుంది.
★ మీ అహంకారానికి.. దళితుల ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోరాటంలో అంతిమ విజయం అంబేద్కర్ వారసులదే అవుతుంది.
★ రాష్ట్రంలో అమలవుతున్న రాజారెడ్డి రాజ్యాంగానికి చరమగీతం పాడి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం.
★ మీరు నియమించుకున్న నామినేటెడ్ పదవుల్లో బడుగు బలహీన వర్గానికి చెందిన వారిని ఒక్కరినైనా నియమించారా?
★ ఓటేసి గెలిపించినందుకు 18 నెలల పాలనలో దళితులకు మీరు ఇచ్చిన బహుమతులేంటో తెలుసా?
★ హత్యలు, అక్రమ కేసులు, దాడులు, శిరోముండనాలు.
★ వందేళ్లకు సరిపడా కేసులు బనాయించారు.
★ మీ కోట చుట్టూ అలుముకున్న అహంకారపు గోడల్ని కూల్చేందుకు మా ఓటు ఆయుధాన్ని ఉపయోగిస్తాం.
