విశాఖపట్నం జిల్లా
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే, శ్రీమతి వంగలపూడి అనిత పత్రికా ప్రకటన వివరాలు..
మహిళా భద్రతను గాలికొదిలేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
– 18నెలల వైసీపీ పాలనలో 400కు పైగా దాడులు, మానభంగాలు
– మృగాళ్లకు అండగా అధికార పార్టీ నేతలు
– చేసేదిలేక చేష్టలుడికి చూస్తున్న పోలీస్ యాంత్రాంగం
★ మహిళలను ముట్టుకుంటే మరణశిక్షే అని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతల్లో ఘోరంగా విఫలమయ్యారు.
★ గడిచిన 18 నెలల కాలంలో 400లకు పైగా మహిళలపై దాడులు, మానభంగాలు జరిగాయంటే వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఏపాటి రక్షణ ఉందో అద్దం పడుతోంది.
★ వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత వల్లే మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది.
★ రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంపై పెట్టిన శ్రద్దను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా భద్రతపై పెట్టి ఉంటే ఎప్పుడు ఏ రూపంలో ఉపద్రవం ముంచుకొస్తుందోనని మహిళలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు.
★ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనూ ఇలాంటి అఘాయిత్యాలు వెలుగుచూడటం బాధాకరం.
★ కొందరు వైసీపీ నేతలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే మరికొందరు అత్యాచారాలకు తెగబడుతున్నవారికి మద్దతుగా నిలవడం దుర్మార్గం కాక మరేమిటి?
★ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనే దళిత మహిళను అత్యాచారం చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న దద్దమ్మ ప్రభుత్వమిది.
★ అనంతపురం జిల్లాలో ముక్కపచ్చలారని బాలికను లారీ డ్రైవర్ మానభంగం చేస్తే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రక్షణగా నిలవడం సిగ్గుచేటు.
★ మీ ఇళ్లలో ఆడవాళ్లకు కష్టమొస్తే ఇలాగే వ్యవహరిస్తారా?
★ అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా?
★ పాలకులు తప్పు చేస్తే శిక్షలుండవా?
★ ప్రకాశం జిల్లాలో దివ్యాంగురాలిని అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెడితే డీజీపీ, హోంమంత్రి ఎందుకు స్పందించలేదు?
★ విచారణకు ఎందుకు ఆదేశించలేదు?
★ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మహిళా కమీషన్ చైర్ పర్సన్ ఎందుకు స్పందించడంలేదు.
★ అసలు ఏపీలో మహిళా కమిషన్ ఉందా?
★ ఆడవారికి కష్టమొస్తే గన్ను కంటే ముందు జగన్నన్న వస్తాడని అసెంబ్లీలో గొప్పలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యేలు కళ్లముందే జరుగుతున్న అత్యాచారాలపై మాట్లాడరేం?
★ దిశా చట్టం గురించి గొంతు చించుకుని చెప్పిన ఆర్కే రోజా రాష్ట్రంలో జరుగుతున్న దుశ్శాసన పర్వంపై ఎందుకు నోరు మెదపవడంలేదు?
★ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతులు క్షీణించాయి.
★ అత్యంత పాశవిక ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.
★ మీరు తెచ్చిన దిశకు దిశానిర్దేశం లేదని స్పష్టమైపోయింది.
★ మాయమాటలతో రెండేళ్లు గడిపేశారు.
★ ఇకనైనా మహిళా భద్రతపై వైసీపీ ప్రభుత్వం దృష్టిపెట్టాలి.
★ లేని పక్షంలో తమకు జరుగుతున్న అన్యాయంపై మహిళలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవు.