Sunday, April 11, 2021

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే, శ్రీమతి వంగలపూడి అనిత పత్రికా ప్రకటన

అమరావతి (గుంటూరు జిల్లా/నరసరావుపేట)

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే, శ్రీమతి వంగలపూడి అనిత పత్రికా ప్రకటన వివరాలు..

దిశా చట్టంతో జగన్ రెడ్డి ఒక్క మహిళకైనా న్యాయం చేశారా?

★ నరసారావుపేటలో డిగ్రీ చదువుతున్న బాలిక దారుణంగా హత్యకు గురికావడం రాష్ట్రంలోని మహిళల భద్రత పై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

★ మహిళలపై మాకే ప్రేమ వుందని వారికి అన్నీ విధాలా రక్షణగా వుంటామని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు మహిళల పై హత్యాచారాలు జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

★ మహిళల భద్రత కోసం దిశా చట్టం తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న జగన్ రెడ్డి ఘోర నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఉదాశీన వైఖరి అవలంభిస్తున్నారు?

★ పులివెందుల ప్యాక్షనిజాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు.

★ వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి రాష్ట్రం లో మహిళలు, బాలికల పై అత్యాచారాలు, లైంగిక వేధింపులు నిత్య కృత్యమయ్యాయి.

★ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న తీరు చూసి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి.

★ 3 వారాల వ్యవధిలో నిందితులకు కఠినమైన శిక్ష విధిస్తామని చెప్పారు.

★ దిశా చట్టం ప్రకారం ఇంత వరకు ఎంతమంది నేరస్థులను శిక్షించారో జగన్ చెప్పగలరా?.

★ ఇప్పుడు దిశా చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేస్తారని ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటు.

★ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఆమోదించినప్పటికీ, పార్లమెంటులో ఆమోదింప చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

★ ఐపిసి, సిఆర్‌పిసిలకు సవరణలు చేసి ఎపికి మాత్రమే వర్తించేలా బిల్లులో చేర్చడంతో కేంద్రం ప్రభుత్వం బిల్లును ప్రక్కన్న పెట్టింది.

★ ఐపిసి, సి.ఆర్.పి.సి ల సవరణలు రాష్ట్ర పరిధిలో ఉండవన్న సంగతి ఈ ప్రభుత్వం పెద్దలకు తెలియదా?

★ జగన్ రెడ్డి కేవలం 21 రోజుల్లో మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

★ దిశా చట్టం తీసుకొచ్చిన తర్వాత జరిగిన సంఘటనలకు ఏం న్యాయం జరిగింది?

★ దిశ పోలిస్ స్టేషన్లకు కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి పార్టీ రంగులేసుకోవడం తప్పా జగన్ చేసింది ఏమి లేదు.

★ రాష్ట్రానికి హోంమంత్రిగా మహిళ ఉండి కూడా మహిళలకు న్యాయం జరగకపోవడం బాధాకరం.
ఏం న్యాయం చేశారు?


★ 1 – డిసెంబర్ – 2019 న కడపలో మైనర్ బాలికను పూజారి వేధించాడు

★ 10 – డిసెంబర్ – 2020 న ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో 45 సంవత్సరాల వయస్సు గల దళిత మహిళలపై అత్యాచారం చేసి హత్య చేశారు

★ 8 – ఏప్రిల్ – 2020 న మచిలిపట్నంలో 24 ఏళ్ళ దళిత క్రైస్తవ మహిళలను పాస్టర్ అత్యాచారం చేశాడు.

★ 31-ఆగస్టు – 2020 న నార్కెట్‌పల్లిలో దళిత మహిళ (పద్మజా) కిడ్నాప్ చేసి ప్రాణాలు తీశారు.

★ 14 – అక్టోబర్ – 2020 న 25 ఏళ్ల మహిళ చిన్నారిపై తన మాజీ ప్రియుడు విజయవాడలోని హనుమన్‌పేట్‌లో నిప్పంటించాడు.

★ 15 – అక్టోబర్ – 2020 న విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న క్రైస్తురాజపురంలోని ఆమె ఇంటి వద్ద 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి తేజస్విని ఒక యువకుడు పొడిచి చంపాడు.

★ 18 – జూలై – 2020 న కర్నూలులో సర్కిల్ ఇన్స్పెక్టర్ చేత మహిళా కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు గురయ్యింది

★ 9 జనవరి 2020 న నెల్లూరులో ఐదుగురు పురుషులు మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేశారు

★ 24 – ఫిబ్రవరి – 2021 న నరసారావుపేటలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని అనుషపై విష్ణువర్ధన్ రెడ్డి దారుణంగా హత్య చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles