Sunday, April 11, 2021

తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం

అమరావతి

తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం వివరాలు..

చట్టంపని చట్టంచేస్తే, ఎన్నికల్లో గెలుపుకోసం ప్రభుత్వం పోలీసులు, రౌడీల అక్రమశక్తిని ఎందుకు నమ్ముకుంది?

– ప్రజల ముందు జింకవేషాలేస్తూ, పక్కకి వెళ్లాక తోడేలు వేషాలేసే వైసీపీ నేతలను ప్రజలు గమనిస్తున్నారు.

– చట్టం తనపని తాను చేస్తుందనే జోగి రమేశ్ చెప్పడం హాస్యాస్పదం.

– కొల్లురవీంద్ర అక్రమఅరెస్ట్ విషయంలోనే చట్టానికి తనపని గుర్తుకొచ్చిందా?

– గుంటూరులో లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాలరెడ్డి బ్యాలెట్ బాక్సుల పగలగొట్టాలని ప్రయత్నించినప్పుడు చట్టం ఏమైంది?

– కర్నూల్లో టీడీపీకార్యకర్త రంగన్న కొబ్బరి, టేకు తోటను తగలబెట్టినప్పుడు చట్టం ఏంచేసింది?

– ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసిన ప్రభుత్వ చర్యలను జోగిరమేశ్ సమర్థించడం సిగ్గుచేటు.

– ఎన్నికల్లో గెలుపుకోసం పోలీసులు, రౌడీలను కలగలపడం ద్వారా ఏర్పడిన అక్రమశక్తిని అధికారపార్టీ నమ్ముకుందని రమేశ్ కు తెలియదా?

– ప్రజాస్వామ్యంలో ప్రజలను గౌరవించకుండా అధికార మదంతో విర్రవీగేవారికి ఏగతి పడుతుందో రమేశ్ కు చెప్పాల్సిన పనిలేదనుకుంటా.

★ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపకోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసిన ప్రభుత్వచర్యలను సమర్థిస్తూ, ప్రభుత్వానికి, అధికారపార్టీకి లేనిపవిత్రతను ఆపాదిస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేశ్ చాటభారతం చెప్పాడని, టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ఎద్దేవాచేశారు.

★ గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

★ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, ప్రజలను భయ భ్రాంతులకు గురిచేశారని చెప్పి మాజీమంత్రి కొల్లురవీంద్రను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం కాదాఅని ప్రశ్నిస్తుంటే, దానికి సమాధానం చెప్పకుండా, బీసీలను చంద్రబాబు గౌర వించలేదంటూ, రమేశ్ వ్యాఖ్యానించడం అతని తెలివితక్కువ తనాన్ని సూచిస్తోందన్నారు.

★ తెలుగుదేశంపార్టీ ఆవిర్భావమే బీసీలతో మొదలైందనే వాస్తవం రమేశ్ కు తెలియకపోవడం ఆయనకున్న అవగాహనారాహిత్యానికి నిదర్శనమని మర్రెడ్డి మండిపడ్డారు.

★ కొల్లురవీంద్ర బూత్ లోకి ప్రవేశించాడని, పోలీ సులను అడ్డుకున్నాడని చెబుతున్నరమేశ్, వైసీపీవారు ఏం చేసినా టీడీపీవారెవరూ ప్రశ్నించకూడదనే నియంత్రత్వధోరణి తో మాట్లాడుతున్నాడన్నారు.

★ చట్టంపని చట్టంచేస్తుందని చెబుతున్న రమేశ్, చట్టంలోని పోలీస్ యంత్రాంగం ఏంచేస్తుం దో సమాధానం చెప్పాలని టీడీపీనేత డిమాండ్ చేశారు.

★ పోలీసులు ఏం చేస్తున్నారో, వారిని భుజానేసుకొని వైసీపీవారు ఎంతలా రెచ్చిపోతున్నారో జోగి రమేశ్ కు తెలియదా అని మర్రెడ్డి ప్రశ్నించారు.

★ అదేపోలీసులను గతంలో వైసీపీనేతలు, ఎమ్మెల్యేలు నానారకాలుగా దుర్భాషలాడినప్పుడు చట్టం తనపని తానెందుకు చేయలేదో రమేశ్ చెప్పాలన్నారు.

★ వైసీపీ వారివిషయంలో చట్టానికి చేష్టలుడిగిపోతాయా అన్నారు.

★ స్థానికఎన్నికలనేవి రాజకీయపార్టీల మధ్యజరిగలేదని, వాటిని ఎదుర్కొనేశక్తి లేకనేవైసీపీ అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకొని బయటపడిందన్నారు.

★ చంద్రబాబు లేకుండా పోతారని, టీడీపీ కనుమరుగవుతుందంటున్న రమేశ్, ముందు తనపరిస్థితేమిటో, తనపార్టీ పరిస్థితేమిటో తెలుసుకోవాలన్నారు.

★ పోలీసులు, రౌడీలను ఏకంచేయగా ఏర్పడిన అక్రమ శక్తితో ఎన్నికల్లో గెలుపుకోసం వైసీపీ ప్రయత్నించిందన్నారు.

★ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలకువచ్చే ధైర్యంలేకనే అధికార పార్టీ అక్రమశక్తులను నమ్ముకుందన్నారు.

★ 2013లో జరిగిన స్థానికఎన్నికల్లో ప్రజలు ఎవరిపక్షాన ఉన్నారో, రమేశ్ మర్చిపోతే ఎలాగన్నారు.

★ ఓటర్ స్లిప్పుల పంపిణీ మొదలు, బూత్ లను ఆక్రమించుకోవడం, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేయడం, పోలీసులు-రౌడీలసాయంతో అభ్యర్థులను బెదిరించడం వంటి ఘటనలకు ఎవరుపాల్పడ్డారో రమేశ్ సమాధానం చెప్పాలన్నారు.

★ టీడీపీ అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి, నామినేషన్లు విత్ డ్రాచేసిన వైసీపీవారికి అభ్యర్థులు లేరో, టీడీపీకిలేరో ఆయనే తెలుసుకోవాలన్నారు.

★ చీకటిపడినతర్వాత లెక్కాపత్రంతో సంబంధంలేకుండా, గెలు పు ఫలితాలుప్రకటించుకొని సంబరాలు చేసుకున్న దిక్కుమాలిన వ్యక్తులెవరో ప్రజలకు అర్థమైనా, రమేశ్ కుఅర్థం కాకపోవడం సిగ్గుచేటని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

★ పట్టణ, నగరాల్లో జరిగే ఎన్నికలు గుర్తుపై జరుగుతాయని తెలిసే, ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాన్ని నిలువరిం చిందన్నారు.

★ ఫలితాలు వచ్చే వరకు ఆగకుండా, చట్టం గురించి వైసీపీఎమ్మెల్యే మాట్లాడటం దారుణమన్నారు.

★ కర్నూలుజిల్లా ఆదోనిలో రంగన్న అనేవ్యక్తి టీడీపీకి పనిచేశా డన్న అక్కసుతో, అతనికిచెందిన పదెకరాల్లోని కొబ్బరి, టేకు చెట్లను తగలబెట్టినప్పుడు రమేశ్ చెప్పిన చట్టం ఎక్కడుందన్నారు.

★ రంగన్నకు జరిగిన అన్యాయం చట్టానికి కనిపించలేదా అన్నారు.

★ వైసీపీఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తమ్ముడు టీడీపీకి చెందిన రిలీవింగ్ఏజెంట్లను బూత్ లలోకి వెళ్లకుండా అడ్డుకున్నప్పుడు చట్టంతనపని తానుచేయకుండా ఏంచేసిందో రమేశ్ చెప్పాలన్నారు.

★ తెలుగుదేశంపార్టీ అభ్యర్థి పచ్చచొక్కా వేసుకుంటే, దాన్నినడిరోడ్డుపై బహిరంగంగా విప్పించడ మే చట్టంచేసే పనా అన్నారు.

★ గుంటూరులో వైసీపీనేతలు లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాలరెడ్డి బ్యాలెట్ బాక్సు లు బద్దలు కొట్టే ప్రయత్నంచేసినప్పుడు, వారిని అడ్డుకోకుండా, టీడీపీ మేయర్ అభ్యర్థి కోవెలమూడి నానీని నిలువరించ డమేనా చట్టంచేయాల్సినపని అని మర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

★ విజయవాడలో మేయర్ అభ్యర్థిని కేశినేని శ్వేతను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారన్నారు.

★ ఆ విధంగా అడుగడు గునా పోలీసులను అరాచకాలకు వాడుకున్న వైసీపీ, ఆపార్టీ ఎమ్మెల్యే చట్టాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

★ అధికారపార్టీ ఎప్పుడూ అరాచకాల గురించే మాట్లాడాలి తప్ప, చట్టాలు, న్యాయాలు అనేపదాలను ఉపయోగించకూ దని మర్రెడ్డి ఎద్దేవాచేశారు.

★ వైసీపీనేతల నరనరాల్లోనే అరాచ కం ఇమిడిఉందన్నారు.

★ చట్టాలు అమలుచేసేవారైతే వందసార్లు కోర్టులతో మొట్టికాయలు తినరన్నారు.

★ న్యాయమూర్తులను దూషించడం, వ్యతిరేకంగా తీర్పులిచ్చారని వారిపై బురద చల్లడం చేసినవారు, చట్టాలకు అనుగుణంగానే ఆపనిచేశారా అని మర్రెడ్డి నిలదీశారు.

★ కొల్లురవీంద్ర అరెస్ట్, ఆయనపై పెట్టిన కేసులు ముమ్మాటికీ క్షమించరాని అంశాలేనన్న శ్రీనివాస రెడ్డి, ప్రజలను ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని అక్రమఅరెస్ట్ లతో అడ్డుకోవాలనిచూస్తే, అది పాలకులకే చేటుచేస్తుందన్నారు.

★ ఎన్నో అక్రమనిర్బంధాలను ప్రజలు ఇప్పటికే చూశారని, ప్రజాస్వామ్యంలో ప్రజలను గౌరవించకుండా, అధికారంలో ఉన్నాంకదా అని ఆగడాలను కొనసాగిస్తే, ప్రజలే తగినవిధంగా బుద్ధి చెబుతారన్నారు.

★ ప్రజస్వామ్యమని, చట్టమని చెప్పే వ్యక్తులు ముందువాటికి లోబడి పనిచేస్తే మంచిదన్నారు.

★ ప్రజలముందు జింకవేషాలేస్తూ, పక్కకొచ్చాక తోడేలు వేషాలే సేవారిని ఎవరూ ఆమోదించరని, కళ్లకు గంతలుకట్టుకొని బతుకుతున్న వైసీపీనేతలు, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం నేర్చుకుంటే వారికే మంచిదని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles