తేదేపా నాయకులు ఆలూరి మృతి విచారకరం, పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు.
ముదునూరు గ్రామంలో, ఆలూరి భౌతికకాయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ జెండాను కప్పి, పూల మాలలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ, ఆలూరి సాంబశివరావు గారు నాకు మంచి స్నేహితుడని , ఆయన మృతి పార్టీపరంగా, వ్యక్తిగతంగా ఎంతో బాధ కలిగించింది.
తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ, నాయకులకు సూచనల రూపంలో అండగా ఉండేవారని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. కుటుంబసభ్యులకు తన సంతాపం తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ పిచ్చిరెడ్డి గారు, మండల తేదేపా అధ్యక్షుడు వేమూరి శ్రీనివాసరావు, కుప్పాల అంజిబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొండా ప్రవీణ్, మండల నాయకులు సోమేశ్వరరావు, చిరంజీవి రెడ్డి, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

