దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన దృశ్యము గౌరవము…..🙏🙏🙏
భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఇంతవరకూ ఏ న్యాయమూర్తికి ప్రజలనుండీ అందనటువంటి అరుదైన అత్యంత గౌరవం జస్టిస్ రాకేష్ కుమార్ గారికి అమరావతి ప్రజలు (రైతులు మహిళలు వృద్ధులు యువత పిల్లలు) నుండి దక్కడం చూస్తుంటే ఉద్వేగంతో ఆనందంతో రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, కళ్ళల్లో ఆనంద భాష్పాలు సుడులు తిరుగుతున్నాయి.
టీవీలో చూస్తుంటేనే మనకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ గొంతు గద్గదమవుతుంటే అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నవారి ఉద్వేగం చూస్తుంటే గుండెలు ద్రవిస్తున్నాయి.
అయినా ఇవి చూసిన రాక్షసరాతి గుండెలు కరుగుతాయా ? సంస్కారహీనులకు విలువలు అంటే అర్ధం తెలుస్తుందా?
అధికారదుర్వినియోగం దోపిడీ డబ్బు హింస హత్యలు అధికారమే పరమావధిగా బ్రతుకుతున్నవాళ్లకు గోముఖవ్యాఘ్రాలకు ప్రజాస్వామ్యం రాజ్యాంగం అంటే గౌరవం విలువ ఉంటుందా?
జస్టిస్ రాకేష్ కుమార్ గారి లాంటి న్యాయమూర్తుల రూపంలో ఇంకా జీవించి ఉన్నటువంటి రూపంలోని న్యాయదేవతకు, జస్టిస్ రాకేష్ కుమార్ గారికి న్యాయవ్యవస్థ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సమున్నతమైన ఘనమైన ఆంధ్రాజాతి ప్రజావీడ్కోలు.🙏🙏🙏
జస్టిస్ రాకేష్ కుమార్ గారి పదవీవిరమణ అనంతర జీవితం శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు దుర్గమ్మ కారుణాకటాక్షాలు మల్లన్న దీవెనలతో వారు సకుటుంబంగా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గౌరవమర్యాదలతో తులతూగుతారని అందరం ప్రార్ధిద్దాం.🙏🙏🙏