Wednesday, July 28, 2021

నగరపాలక సంస్థ ప్రజాసేవ కోసమా? ధనార్జన కోసమా? వి.ఎస్.అమీర్ బాబు, కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి.

పన్నుల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న నగరపాలక సంస్థ

కరోనా కష్టకాలంలో బలవంతపు పన్ను వసూళ్ళు తగదు..

నగరపాలక సంస్థ ప్రజాసేవ కోసమా…? ధనార్జన కోసమా…
వి.ఎస్.అమీర్ బాబు, కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి.

కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి, వి.ఎస్.అమీర్ బాబు గారి ఆధ్వర్యంలో కడప శివారులోని రిమ్స్ వద్ద 25వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి, వి.ఎస్.అమీర్ బాబు. ఈ సందర్భంగా వి.ఎస్.అమీర్ బాబు మాట్లాడుతూ….కరోనా కష్టకాలంలో పేద మధ్యతరగతి ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కడప నగరపాలక సంస్థ పాలక అధికార యంత్రాంగం నీటి, ఇంటి పన్నులను, ట్రేడ్ లైసెన్స్ లను స్పెషల్ డ్రైవ్ పెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండటం దారుణమని మండిపడ్డ వి.ఎస్.అమీర్ బాబు.

కరోనా కరాళనృత్యం చేస్తున్న సమయంలో, చాలామంది కరోనా బారినపడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కరోనా కర్ఫ్యూతో ఉపాధి కోల్పోయి, బ్రతుకు భారంగా మారుతున్న సమయంలో పన్నుల బకాయిలు కట్టాలని ఇళ్ల వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బంది బలవంత పెడుతుండటం ఎంతవరకు సమంజసం… అని నిలదీశారు

ఈ కరోనా కాలంలో నగర పాలక యంత్రాంగం నగర ప్రజాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలను కల్పించకపోగా… పాత బకాయిలకు రూ.2 చొప్పున వడ్డీ వసూలు చేయడం దారుణమని అన్నారు

కరోనా మహమ్మారి వల్ల జీవితాలు దుర్భరమైన పరిస్థితుల్లో ఈ బలవంతపు పన్నుల వసూళ్లు మూలిగే నక్కపైన తాటికాయ పడ్డ చందంగా మారిందని అన్నారు

కరోనా మొదటి దశలోలాగా కనీసం బ్లీచింగ్ పౌడర్, హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ కూడా సక్రమంగా చేయకపోవడం దారుణమని అన్నారు

కడప నగరపాలక మండలి సమావేశాల మీద సమావేశాలు జరిపి జనం ఇబ్బందులు పడుతున్నా పన్నులు కట్టాలని సిబ్బంది ఇళ్ల వద్దకు వెళ్లి బలవంతం చేస్తుండడమే ఈ కరోనా కాలంలో ముఖ్య ఎజెండాగా ఉండడం తగదన్నారు

కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రజలకు సహాయమందించకుండా పెండింగులో ఉన్న నీటి, ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ లు వెంటనే కట్టమని వేధిస్తుoడటం ఎంతవరకు సమంజసం…

కడప నగర పాలక సంస్థకు పన్నుల ద్వారా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వస్తున్న ఫండ్స్, సంస్థ ఆదాయానికి, పెడుతున్న ఖర్చులకు పొంతన ఉండడం లేదని, జమా-ఖర్చులపై ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించకుండా ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు

కరోనా కారణంగా ఉపాధి కోల్పోవడం వల్ల జీవనం దుర్భరమైన సమయంలో రెండు నెలల విద్యుత్ చార్జీలను మాఫీ చేసి, బలవంతపు పన్నుల వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని లేదా వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు

కడప నగరపాలక అధికార యంత్రాంగ వ్యవహారంపై నగర ప్రజలు ఆక్రోశంతో తిరగబడే పరిస్థితులు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, నాసిర్ అలీ, కొండా సుబ్బయ్య, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

518FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles