అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని A నారాయణపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ అనుబంధం బీసీ సెల్ విభాగాన్ని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి విడుదల చేశారు.
ఈ సందర్భంగా నియామక ఉత్తర్వులను నియోజకవర్గ కార్యాలయంలో నూతన కమిటీ సభ్యులకు అందజేశారు.నారాయణపురం పంచాయతీ బీసీ సెల్ నూతన అధ్యక్షుడిగా బోయ కదిరప్ప, ఉపాధ్యక్షులు గా రజక రామాంజనేయులు, కురుబ నవీన్, ప్రధాన కార్యదర్శి గా రజక రాజు,కార్యనిర్వాహక కార్యదర్శులు గా గంగాధర్, వడ్డే వెంకటేష్, లక్ష్మీనారాయణ, కార్యదర్శులుగా శ్రీరాములు, వెంకటేష్, గంగాధర్, కోశాధికారిగా పెన్నోబులపతి, కార్యవర్గసభ్యులుగా ఖాదర్ వలి,చౌడప్ప, షరీఫ్,చిదంబర ను నియమించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం టీడీపీ తోనే సాధ్యమన్నారు.బీసీల చేతి వృత్తులు, కులవృత్తుల కోసం ఆదరణ పథకం ప్రవేశపెట్టి వారికి ఆర్ధిక చేయూత నిచ్చిన ఘనత అధినేత చంద్రబాబు దే నన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటే విధంగా పార్టీ శ్రేణులందరు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు పోతుల నరసింహులు, టీడీపీ జిల్లా నాయకుడు డిష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
