కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతికరేక చట్టాలను రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేస్తూ ఈ రోజు నెల్లూరు నగరం లో టి.ఎన్ఏ.స్ఎ.ఫ్ మరియు తెలుగు యువత అద్వర్యం లో వి ఆర్ సి సెంటర్ లో రాస్తా రోకో మరియు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమం లో తెలుగు యువత నాయకుడు డి.వి.కృష్ణ యాదవ్ మరియు టి.ఎన్ఏ.స్ఎ.ఫ్ నెల్లూరు పార్లమెంట్ కోఆర్డినేటర్ వి.ప్రణయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం,నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చినప్పుడు నుండి ఇప్పటి వరకు పాట నోట్లు రద్దు కానీ NRC,NPR చట్టం అయితే ఏమి రైల్వే ని,LIC ని ప్రైవేటైజెషాన్ చెయ్యాలి అని చెప్పడం అలాగే మన దేశం లో ఉన్నటువంటి వనరుళ్లన్నింటిని ప్రైవేట్ వ్యక్తుల పరమ్ చెయ్యాలని చెప్పడం లో కూడా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ పూనుకొని వుంది అని స్వష్టం గా తెలుస్తుంది.
ఈ రోజు రైతులకి వ్యతిరేఖం గా తెచ్చిన చట్టం ఏదయితో ఉందొ దానిని వెంటనే ఎత్తివేయాలి అలాగే రైతు ల పై పెట్టిన కేసుల్ని కొట్టివేయాలి అని టి.ఎన్ఏ.స్ఎ.ఫ్ మరియు తెలుగు యువత డిమాండ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమం లో టి.ఎన్ఏ.స్ఎ.ఫ్ మరియు తెలుగు యువత నాయకులూ ప్రభాకర్ రెడ్డి ,విజయ్ ,కార్తీక్, సుమన్,రాకేష్,నాసిర్ ,సుకాంత్,మధు ,నితిన్, ప్రశాంత్ ,వెంకీ,సంధాని ,నాగూర్ తదితరులు పాల్గొన్నారు.
