నెల్లూరు జిల్లా, కలువాయు మండలం, వీరుబోట్ల పల్లి లో కలకత్తా నుండి పనుల నిమిత్తమై ఇక్కడికి వచ్చిన 40 మంది అస్వస్థకు గురైనారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు జి జి హెచ్ కు తరలించారు. కలుషిత నీరు తాగినందునే అస్వస్థతకు గురైనారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విషయ తెలుసుకున్న నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు జిజిహెచ్ వెళ్లి బాధితులను పరామర్శించారు.