కర్నూలు జిల్లా
నేను అభివృద్ధి చేస్తే.. జగన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు
తెదేపా హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్ విధ్వంసానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.
కర్నూలులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు.
– కర్నూలు కింగ్ మార్కెట్ నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
– ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు.
★ రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిన్నదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
★ ఆలయాలపై దాడులు చేస్తున్నారన్న చంద్రబాబు.. ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారన్నారు.
★ పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదని వ్యాఖ్యానించారు.
★ రాష్ట్రంలో ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
★ జగన్.. ఏబీసీడీ పాలన తెచ్చారని దుయ్యబట్టారు.
★ ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన.. బీ అంటే బాదుడు, సీ అంటే అవినీతి, డీ అంటే విధ్వంసమని వ్యాఖ్యానించారు.
★ అమరావతిని సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
★ బాబాయిని ఎవరో చంపారని ఆనాడు అన్నారు.
★ ఈరోజు ఎవరు చంపారో అర్థం అయ్యింది.
★ నాకు అన్యాయం జరిగిందని షర్మిల రోడ్డెక్కారు.
★ సమైక్యాంధ్రలో నేనే ఎక్కువ కాలం పని చేశాను.
★ చిత్తూరులో ఏకగ్రీవాలు చేశారు.
★ తిరుపతిలోకి అనుమతి ఇవ్వలేదు.
★ చరిత్రలో ఎన్నడూ ఇన్ని ఏకగ్రీవాలు జరగలేదు.
★ నామినేషన్లు అన్నీ సక్రమంగా ఉన్నా రిజెక్ట్ చేశారు.
★ 50 శాతంపైగా నెగ్గేవాళ్లం.
★ అర్ధరాత్రి డ్రామా జరిగిందని చంద్రబాబు అన్నారు.