ఫ్లాష్… ఫ్లాష్… ఫ్లాష్
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కై హౌస్ పిటీషన్ దాఖలు చేసిన SEC
నేడు హౌస్ పిటిషన్ స్వీకరించిన వైనం.రేపు విచారించనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిలిపివేస్తూ నేడు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల సందర్భంగా హైకోర్టు వెల్లడించిన పలు అంశాలపై సంపూర్ణ సమాథానంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆవశ్యకతను తెలిపేందుకు హౌస్ మోషన్ మూవ్ చేసి సన్నద్ధం అవుతున్న SEC
రేపు ఉదయం విచారణకు రానున్న హౌస్ మోషన్ పిటీషన్
కరోనా వాక్సినేషన్ కు ఆటంకంలేకుండా,ఎన్నికల విథులు నిర్వహించే సిబ్బంది,ఓటర్లు కోవిడ్ నిబంథనలు పాటిస్తూ,పూర్తి రక్షణ చర్యలతో ఎన్నికల నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నామని ధ్విసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించే దిశగా SEC
ఎన్నికల నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మథ్యంతర ఆదేశాలు సుఫ్రికోర్టు తీర్పులకు వ్యతిరేకం అని,రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని అడ్డకోవడమే అనే కోణంలోనూ వాదనలు సాగవచ్చుననే అభిప్రాయాలను వెల్లడిస్తున్న న్యాయనిపుణులు
నేడు హైకోర్టు ఎన్నికల నిపివేత ఆదేశాలతో ఊరటచెంది ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకోన్న అథికారపార్టీ శ్రేణులలో హౌస్ మోషన్ పిటీషన్ పై రేపటి ధ్విసభ్యధర్మాసనం నుండి ఎటువంటి ఆదేశాలు వస్తాయో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది
పంచాయతీ ఎన్నికల నిర్వాహణ పై రేపు హైకోర్టు నుండి వచ్చే ఆదేశాలతో శుభంకార్డు పడుతుందా?లేక సుఫ్రింకోర్టు వరకూ ఈవివాదాన్ని అటు ప్రభుత్వం ఇటు SEC సాగదీస్తారా?అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈవివాదం ముగింపు కోరకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.