Friday, February 26, 2021

పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు

పంచాయతీ ఎన్నికలలో అన్ని స్థానాల్లో నామినేషన్ లు వేసి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలని…. తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు…..

శుక్రవారం, మచిలీపట్నం లోని పార్లమెంట్ కార్యాలయంలో, రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన, తెలుగుదేశం పార్టీ పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టో 2021 (పల్లె ప్రగతి—పంచ సూత్రాలు), (పల్లెలు మళ్లీ వెలగాలి) అంటూ, పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు…..

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ……

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పల్లెల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వివరించడంతో పాటు…. తెలుగుదేశం అభ్యర్థి గెలిస్తే మీ ఊరికి ఏం చేస్తారో ప్రజలకు వివరించాలన్నారు.

తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ప్రణాళికను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలన్నారు. పల్లె ప్రగతి-పంచ సూత్రాలు, పల్లెలు మళ్లీ వెలగాలి, అనే మన తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను గ్రామాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటింటికి పంపిణీ చేయాలని, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు పార్టీ శ్రేణులకు సూచించారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎవరు ఏ ఆటంకం కలిగించిన, మీ హక్కులను భంగ పరిచిన, అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ కాల్ సెంటర్ నెంబర్ 7306299999, ఫోటో, వీడియో సాక్ష్యాధారాలను పంపాల్సిన వాట్సాప్ నెంబర్ 7557557744 కు వెంటనే తెలియచేయాలని, అలాగే మీ నియోజకవర్గాల్లో మండల స్థాయి నాయకులకు, నియోజకవర్గ ఇన్చార్జి లకు కూడా వెంటనే సమాచారం ఇచ్చిన ఎడల, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల సలహా మరియు సాయం తీసుకోవచ్చు అన్నారు. ఎవరైనా అవరోధాలు కలిగిస్తే ఫోన్లలో రికార్డు చేయండని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా అవే ఆధారాలు అన్నారు.

వైసీపీ నాయకులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించ కపోతే నిధులు ఇవ్వమని బెదిరిస్తున్నారు అని, ఇది పచ్చి అబద్ధం అన్నారు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా పంచాయితీ ఎకౌంట్ లకు నిధులు జమ చేస్తోంది అన్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేక, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నే రోడ్లు వేయిస్తున్నారు అన్నారు. స్థలాల మేరక ఎన్ఆర్ఈజీఎస్ నిధులనే వాడుతున్నారు అన్నారు. గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నామమాత్రమే అన్నారు.

వైసీపీ విధ్వంసకాండ తో రాష్ట్రానికి ఎనలేని చెడ్డపేరు వచ్చిందన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో వైసీపీపై తీవ్ర అసంతృప్తి, ఉన్మాద చర్యలు, న్యాయస్థానాల చివాట్లు, విధ్వంసా లతో ప్రజలు విసిగిపోయారు అన్నారు.

అన్ని స్థానాల్లో నామినేషన్ లు వేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలి అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే వాళ్లకు బుద్ధి చెప్పాలని, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు పోతున్నాం, మీ గ్రామాలలో సమర్థ నాయకత్వానికి దోహదపడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, అమరావతి రాజధాని పై బురద జల్లుతూ, అమరావతి రాజధాని పై విషం కక్కుతున్న వైసీపీ పాలకుల వైఖరిని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారాస్త్రంగా కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు, అలాగే మూడు రాజధానుల నష్టాన్ని కూడా ప్రజలకు వివరించాలని అన్నారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు.

మన రాజధాని అమరావతిని పరిరక్షించుకోవాలి అంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు సూచించారు.

ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు.

మచిలీపట్నం లోని, కాలే ఖాన్ పేట, తదితర ప్రాంతాలకు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు వెళ్లి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బత్తిన దాసు, పివి ఫణి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles