పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆశావాది ప్రకాశరావు ను అభినందించిన అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి…..
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆశావాది ప్రకాష్ రావ్ ను అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అభినందించారు. నగరంలోని రెవెన్యూ కాలనీలో ఉన్న ఆయన ఇంటికి గురువారం టీడీపీ నాయకులతోపాటు వెళ్లి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రావ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కు చెందిన ప్రకాశ్ రావ్ కు పద్మశ్రీ అవార్డు దక్కడం శుభపరిణామమన్నారు.ఆశావాది ప్రకాశ్ రావ్ భవిష్యత్ లో మరిన్ని ఉత్తమ అవార్డులు అందుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దేవల్ల మురళి,మారుతి గౌడ్,లింగారెడ్డి, గౌస్ పీరా,దాసరి శ్రీధర్, బంగి నాగ ,సైఫుద్దీన్,ఋషి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

