ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంకి చెందిన వెలగల సత్యనారాయణరెడ్డి గారు, చోడే సంజీవరావు గారు , దొంగ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మాజీ శాసన సభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారి సమక్షంలో వైసీపీ పార్టీకి చెందిన సుమారు 50 మందికి పైగా కార్యకర్తలు, యువత తెలుగుదేశం పార్టీ లోకి జాయిన్ అయ్యారు. వారికి రాధాకృష్ణ గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఒక్క ఛాన్స్ అంటూ మాటలు చెప్పిన జగన్ గారి మాటలు నమ్మి ప్రజలు అవకాశం ఇస్తే ఈరోజు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను పీడించుకుతింటున్నారు. 18 నెలలుగా కాలయాపన చేస్తూ పేద , మధ్య తరగతి వారిని పీక్కుతింటున్నారు. రాబోవు స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధిస్తుంది.