అమరావతి/పులివెందుల
కడప జిల్లా, పులివెందులలో దళిత మహిళ హత్యాచారంపై డి.జి.పి కి లేఖ రాసిన తెదేపా అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు.
మేకలు మేపుకోవడం కోసం వెళ్లిన దళిత మహిళ నాగమ్మను అతిదారుణంగా అత్యచారం చేసి, చంపడం చాలా దారుణం.
★ రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
★ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు కావడం లేదు.
★ అధికార పార్టీ అండతో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయి.
★ ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
★ అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా హత్యాచారానికి కారకులైన దోషులను రక్షించాలని చూస్తున్నారు.
★ అందులో బాగంగానే ఎప్.ఐ.ఆర్ లో గుర్తుతెలియని వ్యక్తులు అని నమోదు చేశారు.
★ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి.
★ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని అమలు చేసి బాధితులకు న్యాయం చేయండి.
★ మానవ హక్కుల దినోత్సవం నాడైన కనీసం బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించండి.
