Sunday, February 28, 2021

ప్రభుత్వం ఆర్.ఎం.పీ లను ఆదుకోవాలి – నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జ్ డా॥చదలవాడ డిమాండ్

ప్రభుత్వం ఆర్ ఎం పీ లను ఆదుకోవాలి:-నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జ్ డా॥చదలవాడ డిమాండ్

ప్రభుత్వం ఆర్ ఎం పీ లను ఆదుకోవాలని నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జ్ డా॥చదలవాడ అరవింద బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం విలేజ్ క్లినిక్ లను ప్రవేశపెట్టి ఆర్ ఎం పీ ల పొట్టకొట్టాలని చూస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఆర్ ఎం పీ వృత్తి పై ఆధారపడి జీవిస్తున్నారని ఈ రోజు ప్రభుత్వం విలేజ్ క్లీనిక్ లను ప్రోత్సహించడం వలన ఆర్ ఎం పీలు వారి పై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబ సభ్యుల జీవితాలు పూర్తిగా రోడ్డుపై పడే పరిస్థితి ఉందని తక్షణమే ప్రభుత్వం ఆర్ ఎం పీ లకు విలేజ్ క్లీనిక్ లో ఉద్యోగ అవకాశం కల్పించి వారికి ఉద్యోగ భద్రతనివ్వాలని తక్షణమే ప్రభుత్వం మొద్దునిద్ర వీడి ఆర్ ఎం పీ లకు అండగా నిలవాలని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గత ప్రభుత్వం లో నిరుపేదలకు ఉచితంగా మోకాళ్ళ చిప్పల మార్పిడి ఆపరేషన్లు నిర్వహించేవారని ఇప్పుడు అవి కూడా ఆపేశారని తక్షణమే మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వాలని అరవింద బాబు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles