ఇటీవలే కరోనా కల్లోలం నుంచి కోలుకుంటున్న ప్రజలకు మరొక ముప్పు బర్ద్ ఫ్లూ రూపం లో పొంచి ఉందని జెసి అష్మిత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ , కేరళ , మధ్యప్రదేశ్ ,రాజస్థాన్ తో పాటుగా మరికొన్ని రాష్ట్రాలలో ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది, కాబట్టి ముందు జాగ్రత్త గా ప్రజలందరూ కూడా గుడ్లను లేదా మాంసాన్ని బాగా ఉడకబెట్టుకొనే తినాలి,తాజాగా ఉన్న మాంసాన్నే తినేలా చూసుకోవడం మంచిదని ఆయన తెలిపారు.
పక్క రాష్ట్రాలలో పరిస్థితి చూసి ముందు జాగ్రత్తగా మున్సిపల్ అధికారులు తక్షణం స్పందించి చికెన్ వ్యాపారులతో , కోడి గుడ్ల వ్యాపారులతో సమావేశం ఏర్పాటుచేసి వారికి బర్ద్ ఫ్లూ లక్షణాల గురించి దాని వ్యాప్తి గురించి వ్యాపారులకు అవగాహన కలిగించడం మూలాన వారు జాగ్రత్త ఉండే అవకాశం ఉంది. ప్రజలకు కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి మైకుల ద్వారా అనౌన్స్ చేయడం వల్ల ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకొనే అవకాశం కలదు అని ఆయన తెలిపారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు , ఆరోగ్యశాఖ వారు స్పందించి ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా జెసి అష్మిత్ రెడ్డి గారు కోరారు.