Sunday, April 11, 2021

మచిలీపట్నం జిల్లా కోర్ట్ ప్రాంగణం నుంచి మీడియాతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

కొల్లు రవీంద్ర అరెస్టు ప్రభుత్వ దుర్మార్గ చర్య

అక్రమ కేసులకు జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి

గతంలో అచ్చెన్నాయుడుని 70 రోజులు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించారు

కొల్లు రవీంద్ర గారిని 54 రోజులకు పైగా జైల్లో పెట్టించారు ఇంకా మీ కక్ష తీరలేదు

ఇసుక కొరత సృష్టించారు

భవన నిర్మాణ కార్మికుల కష్టాలు చెబితే కేసు పెట్టారు

అర్ధరాత్రి కొల్లు రవీంద్ర గారి ఇంటికి వచ్చి పోలీసులు హడావుడి చేసి కనీసం పాల ప్యాకెట్లు కూడా ఇంటికి రానివ్వలేదు

ఒక కేబినెట్ మాజీమంత్రి మీద చేయి వేసి నెడతారా!

ఏ తప్పు చేశాడని… మీ దుర్మార్గాలను, మీ పాపాలను ప్రశ్నించినందుకా..?

కొల్లు రవీంద్ర ఏమైనా నక్సలైటా?

కొల్లు రవీంద్ర గారు అటువంటి వ్యక్తి కాదు మంచి మనిషి, నిజాయితీ పరుడు మాతో ఏనాడు తప్పుడు పనులు చేయమని చెప్పలేదు కొంతమంది అధికారులు చెబుతున్నారు

నిన్న మా మాజీ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు గారి కారు పైన దాడి చేశారు

మా ఎంపీ నాని గారు ఓటు ఒక చోట ఉంది మా శ్వేత గారి ఓటు ఒక చోట ఉంది. ఇదేమైనా ఇంటర్ పరీక్షలో జంబ్లింగ్ చేసినట్లు ఓట్లు జెంబ్లింగ్ చేశారు

ఇది నీ పరిపాలన తీరు జగన్మోహన్ రెడ్డి

ఒక ఉన్నత అధికారి చెప్పాడు మాతో ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు పైన అధికారులు చేపించారు మీరు ఒడిపోయము అని ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకండి

పోలింగ్ దగ్గరకు కానీ కౌంటింగ్ దగ్గరకు కానీ మీడియా మిత్రులను రానివ్వలేదు

మీడియా వాళ్ళు వస్తే వాళ్ళు చేసే పాపాలు బయట పడతాయని భయపడి మీడియా వాళ్ళను రానివ్వలేదు

ఓటర్ స్లిప్లు కట్టకు 25 కట్టాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థిలవి 28 కట్టి వైసీపీ వాళ్ళవి 20 కట్టి బూత్ లో మోసం చేశారు

ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి రేపు కౌంటింగ్ వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles