Thursday, February 25, 2021

మహిళల రక్షణ చర్యలకు ముఖ్యమంత్రి సమయం ఇవ్వకపోవడం బాధాకరం – నారా లోకేష్

అమరావతి/ఒంగోలు

జన్మదినోత్సవం అంటూ భజన కార్యక్రమాలకు ఇస్తున్న సమయం కూడా మహిళల రక్షణ చర్యలకు ఇవ్వకపోవడం బాధాకరం.

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్

★ ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరిని అత్యంత దారుణంగా సజీవ దహనం చేస్తే స్పందించే హృదయం, సమయం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి లేదు.

★ ఈ ఘటన ద్వారా మహిళల రక్షణ పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు అనే విషయం మరోసారి బయటపడింది.

★ జన్మదినోత్సవం అంటూ భజన కార్యక్రమాలకు ఇస్తున్న సమయం కూడా మహిళల రక్షణ చర్యలకు ఇవ్వకపోవడం బాధాకరం.

★ రాష్ట్రంలో ప్రతీ రోజు మహిళలపై జరుగుతన్న అఘాయిత్యాలు, హత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

★ 18 నెలల పాలనలో 310 ఘటనలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు.

★ ఒక్క మృగాడికి శిక్ష పడలేదు.

★ దిశ చట్టం పేరుతో పబ్లిసిటీ పిచ్చి తప్ప ఒక్క మహిళకూ న్యాయం జరగలేదు.

★ ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయిలో అత్యున్నత దర్యాప్తు జరపాలి, నిజానిజాలను బైటపెట్టి,దీనికి కారకులను కఠినంగా శిక్షించాలి.

★ భువనేశ్వరి కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వం న్యాయం చెయ్యాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles