Friday, March 5, 2021

మాజీ మంత్రివర్యులు, శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి పత్రికా ప్రకటన

విశాఖపట్నం జిల్లా (పెందుర్తి)

మాజీ మంత్రివర్యులు, శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి పత్రికా ప్రకటన వివరాలు..

బులుగు బ్యాచ్ గుండెల్లో స్థానిక సంస్థల భయం

– అప్పుడు వాయిదా తప్పన్నారు.. నేడు పెడతామంటే వద్దంటున్నారు

★ ప్రజలు మా పాలనను మెచ్చుకుంటున్నారు.

★ దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్నాం అంటూ జబ్బలు చరుచుకుంటున్న వైసీపీ నేతలు.. స్థానిక సంస్థల పేరుతో ప్రజాభిప్రాయం తీసుకుందామంటే పంచెలు తడుపుకుంటున్నారు.

★ మార్చిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ఎన్నికలు వాయిదా వేస్తే.. ఎన్నికలు పెట్టాల్సిందే అంటూ గింజుకున్నారు.

★ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందంటూ కేకలేసిన బులుగు బ్యాచ్.. నేడు ఎన్నికలు పెడతామంటే వద్దంటూ అరవడం ఆశ్చర్యం.

★ స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్న ప్రతి సారి బులుగు బ్యాచ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.

★ అండగా ఉన్నారని భావించిన ప్రజలు చెప్పులతో కొట్టి కనీసం ప్రచారానికి కూడా రానీయకుండా చేస్తారనే భయం వైసీపీ నేతల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

★ ప్రభుత్వ దోపిడీ, దుర్మార్గాలు, అవినీతి, చేతకాని పరిపాలన, పనికిమాలిన పథకాలపై ప్రజల్లో స్పష్టత వచ్చింది.

★ బులుగు బ్యాచ్ గుడ్డల్ని ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊడగొట్టడం ఖాయమని వారి మాటల్లోనే తెలుస్తోంది.

★ ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకుని.. ఎన్నికలకు సహకరించాలి.

★ ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకుంది.

★ స్కూళ్లు తెరిచారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సభలు సమావేశాలు జరుగుతున్నపుడు లేని కరోనా.. ఎన్నికలకు మాత్రమే అడ్డంకి అన్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడడం సిగ్గుచేటు.

★ దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడి ప్రజలో ప్రయాణాలు చేస్తున్నపుడు లేని కరోనా.. ఏ ఊరి ప్రజలు ఆ ఊరిలో ఓట్లు వస్తే కరోనా విస్తరిస్తుందా.?

★ ఉద్యోగ సంఘాలు.. ప్రజల కోసం పని చేయాలి. అంతేగానీ.. నీతి నియమాలు మాని వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తాలని ప్రయత్నిస్తే ఎదురు దెబ్బలు తప్పవని గుర్తుంచుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles