అమరావతి: ముఖ్యమంత్రి ఆదేశాలతో అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెడితే తమ ప్రభుత్వం వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ప్రతిపక్ష నాయకులకు సెక్యూరిటీ తొలగించి, అక్రమ కేసులతో కుట్రలు పన్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులు అధైర్యపడవద్దన్నారు. రాముడు మనతో ఉన్నాడు, న్యాయం జరిగి తీరుతుందన్నారు
గురువారం నాడు రాజధాని ప్రాంతంలోని మందడం, వెలగపూడి, తుళ్లూరు రైతు శిబిరంలో గత 387 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ
జగన్ తన పబ్బంగడుపుకొని రాజధాని విషయంలో నిలువునా మోసం చేసి మడమతిప్పాడు
387 రోజులుగా మొక్కవోని దీక్షతో రాజధాని రైతులు దీక్షలు చేస్తున్నారు
117 మంది రైతులు ఆత్మహత్యలు బలిదానాలు గుండె ఆగి చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరిని కూడా పరామర్శించిన పాపాన పోలేదు
వచ్చిన రెండేళ్ళల్లో 2లక్షల అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా తినేసారు
దీక్షలు మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు రెండు సంక్రాంతులు రెండు క్రిస్మస్ లు పూర్తి చేసుకుంటున్నాము
తప్పుడు కేసులు పెట్టారు దాడులు చేసారు మహిళలనుబాధపెట్టినా ఇంత పెద్ద ఎత్తులన మహిళలు ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు
ముఖ్యమంత్రి ఇంటి ముదే మంత్రలు బూతులు మాట్లాడుతూ పేకాట ఆడతాం ఏం పీకుతారు అంటూ మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉందో అర్థం అవుతుంది
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 14ఏళ్లు ముఖ్యమంత్రి 12ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిపై కేసులు పెట్టి రాక్షసంగా ఆటవికంగా పరిపాలన సాగుతుంది
ప్రభుత్వం దేవాలయలపై చేసే దుర్మార్గమైన దాడులే ప్రభుత్వానికి రోజులు దగ్గరపడేట్టు చేస్తాయి