Monday, March 1, 2021

మీడియాతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

మైలవరం పట్టణం రైతుబజారును సందర్శించి నిత్యవసరాలు, కూరగాయల ధరలను అడిగితెలుసుకున్న అనంతరం మీడియాతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

నిత్యవసరాల ధరలు 200 – 300 శాతం పెంచేశారు

వైసీపు నాయకులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్ విక్రయాలు

పేదలకిచ్చే రేషన్ కూడా వైసీపీ నేతలే బొక్కేసారు

మద్యం రేట్లు 200శాతం, 300శాతం పెంచారు. రూ.9వేల కోట్ల భారం మోపారు ఏపీలో నాసిరకం జగన్ మద్యం బ్రాండ్లు దేశంలో ఎక్కడా లేవు

పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో 150 మందిపైగా అస్వస్థతకు గురవ్వడం దిగ్భ్రాంతికి గురిచేసింది

త్రాగునీరు కలుషితమవడంలో ప్రభుత్వనిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది

వైద్యశాఖమంత్రి నియోజకవర్గంలో జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ?

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో కొండలను తొలచి రూ.100కోట్ల గ్రావెల్ శాసనసభ్యుడు అతని బామ్మర్ది కొట్టేసారు

వాహనాలు సీజ్ అయ్యాయి, అధికారులు సస్పెండ్ అయ్యారు

వంద రోజులు దాటినా అక్రమార్కులపై చర్యలు లేవు విచారణ ముందుకు సాగనివ్వకుండా అధికారులపై మైలవరం శాసనసభ్యుడు ఒత్తిడి

నిబంధనల ప్రకారం ఐదు రెట్లు జరిమానా వసూలు చేయాలి

వరుస విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకొని దెబ్బతిన్న పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు త్వరితగతిన పంట నష్టపరిహారం అందజేయాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles