గుంటూరు జిల్లా (తెనాలి)
ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రివర్యులు, శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ బహిరంగ లేఖ
మువ్వెన్నెల జెండా గౌరవాన్ని కాపాడే అర్హత మీకుందా?
★ జాతీయ జెండాకు 100 ఏళ్లు పూరైన సందర్బంగా జెండా ఆవిష్కర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతారావమ్మను సన్మానించడం సంతోషకరం.
★ రెపరెపలాడే జెండా అంటే యావత్ దేశ సంస్కృతికి నిదర్శనం, సమానత్వం, సౌబ్రాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.
★ కాని మీ 22 నెలల పాలనలో ఎక్కడా ఈ అంశాలను స్పృశించిన పాపాన పోలేదు.
★ ప్రతి సంఘటనలోను, ప్రతి క్షణంలోను ప్రజాస్వామ్యాన్ని మంటగల్పిన నాయకత్వం మీ పాలనలో సుస్పష్టంగా కనపడింది.
★ ఇలాంటి తరుణంలో మీ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ గౌరవ పురష్కారమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
★ ఎన్నికలను ఒక తంతుగా చేసుకొని కనీస ప్రాధమిక అంశాలకు తిలోదకాలు పలికి, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేకుండా డా.బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగానికి విఘాతం కలిగించడమే కాకుండా తూట్లు పొడవడానికి సైతం అనునిత్యం ప్రయత్నించారు.
★ వ్యవస్థల మీద గౌరవం లేనటువంటి పాలన, పులివెందుల పంచాయితీ వెరసి రాజారెడ్డి రాజ్యాంగానికి అనుగుణంగా నడపాలన్న కాంక్ష, కీర్తితో కూడుకున్న మీ నైజం ప్రస్పుటంగా కనిపించే ప్రాంతం మాచర్ల ప్రాంతం.
★ అక్కడ అన్యాయాలు, అక్రమాలు, గ్రామ బహిష్కరణలు, దళితుల ఊచకోతలు, మైనార్టీలపై దాడులు పెచ్చురిల్లాయి.
★ ఇక ఎన్నికల్లో బెదిరింపులు అక్రమ అరెస్టులు, హత్యలు, హత్యా ప్రయత్నాలు, రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగే ప్రాంతంగా భావించడానికి నూటికి నూరు శాతం మీ పాలనా వైఖరికి నిదర్శనం.
★ ప్రజాస్వామ్య విలువలు పెంచి సామరస్యతకు, శాంతికి చిహ్నంగా నిలిచే మువ్వెన్నెల జెండా గౌరవాన్ని కాపాడే అర్హత మీకు ఉందా అనే ప్రశ్న ఉదయించక తప్పదు.
★ పెద్దలను సంస్కరించుకునే ముందు చేసిన తప్పులు ఒప్పుకోవాలి.
★ అందుకే వారిని గౌరవించే ముందు మాచర్ల ప్రజలకు మీరు చేసిన అన్యాయం మీద సమాధానం చెబితే అది రాష్ట్రానికి, జాతికి గౌరవం.

