Sunday, April 11, 2021

మునిసిపల్ ఎన్నికల్లో ప్ర‌జాతీర్పుని గౌర‌విస్తున్నాం – నారా లోకేష్

మునిసిపల్ ఎన్నికల్లో ప్ర‌జాతీర్పుని గౌర‌విస్తున్నాం. ఎన్నిక‌ల‌ కోసం రాత్రనక పగలనక శ్ర‌మించిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు అభినంద‌న‌లు.ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అరాచ‌కాన్ని,జ‌గ‌న్‌రెడ్డి అధికార‌మదాన్ని  ఎదిరించి నిలిచి గెలిచిన‌వారికి,పోరాడి ఓడిన‌ వారికి..అందరికీ శిర‌సువంచి న‌మ‌స్క‌రిస్తున్నాను.ఎందుకంటే ఎన్నిక‌లే జ‌ర‌ప‌కూడ‌ద‌నుకున్న జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు అప్ర‌జాస్వామిక వైఖ‌రిని ప్ర‌జ‌ల ముందు ఉంచడంలో మనం సక్సెస్ అయ్యాం. ఎన్నిక‌ల్లో పోటీచేస్తే చంపేస్తామ‌ని వైసీపీ నేత‌లు బెదిరించినా, నామినేష‌న్లు వేసిన‌ కొందరిని చంపేసినా..అద‌ర‌క బెద‌ర‌క తెలుగుదేశం  సైనికులు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. వైసీపీకి ఓట్లు వేయ‌కుంటే ప‌థ‌కాలు ఆపేస్తామ‌ని ఓట‌ర్ల‌ను భ‌య‌పెట్టి జ‌రిపిన ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసి నిరాశ చెందొద్దు.బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్షంగా… ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై తెలుగుదేశం త‌న పోరాటాన్ని కొన‌సాగిస్తుంది.ఆ పోరాటంలో క్రమశిక్షణ, అంకితభావం కలిగిన సైనికులుగా పనిచేద్దాం.
ప్రజలకు అండగా నిలిచి వారికి మరింత చేరువయ్యేందుకు కృషిచేద్దాం.

…నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles