Wednesday, October 20, 2021

మున్సిపాలిటీ ఎన్నికల్లో YSRCP విజయ కేతనం

గత నాలుగు రోజుల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల వోట్ల లెక్కింపులో YSRCP విజయకేతనం ఎగురవేయగా TDP కి అన్నిచోట్ల గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది. వై.యస్.ఆర్.సి.పి. 73 మున్సిపాలిటీలు కైవసం చేసుకోగా TDP 2 మున్సిపాలిటీలతో సరిపెట్టుకో వలసివచ్చింది.

అలాగే మొత్తం 11 కార్పొరేషన్లను వై.యస్.ఆర్.సి.పి. దక్కించుకోగా TDP ఘోర పరాభవాన్ని చవిచూసింది.

ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియచేస్తూ….. ఈ గొప్ప విజయం ప్రజలది. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మా , ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైంది. ఈ విజయం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను మరింత పెంచింది. ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయ పడతాను. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్కచెల్లెమ్మకూ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి …… తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలారా… స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం కోసం మీలో ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారు. మీ పోరాటస్ఫూర్తికి వందనాలు. ప్రస్తుత ఫలితాల విషయానికి వస్తే, నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడాం. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదాం. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

518FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles