Sunday, March 7, 2021

ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులకు అండగా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్… కష్ట కాలంలో సాయం

ఉయ్యూరు లో ఉన్న ముస్లిం మైనార్టీ సోదర, సోదరీమణులందరూ నాకు ఎల్లప్పుడూ అండగా ఉన్నందుకు వారికి నా కృతజ్ఞతలు – ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్

ఉయ్యూరు మున్సిపాల్టీ 18 వార్డులో శ్రీమతి సునోబా అనే మహిళ భర్త చనిపోయి, ఇద్దరు పిల్లల్లో ఒక పాపకు మెదడు వాపు వ్యాధి, ఇంకొక బాబుకి హై బిపి సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కారణంగా వారి కుటుంబానికి 10,000 వేల రూపాయలు, మరో పేద ముస్లిం మహిళకి 1000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు.

అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీమతి సునోబా ఇద్దరి పిల్లల వైద్యం తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా డాక్టర్లతో మాట్లాడి నా సహాయ సహకారాలు అందిస్తానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు

ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉయ్యూరు పట్టణ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులేనని, ముఖ్యంగా 17,18,19,20, 2 వార్డుల్లో ఉన్న ముస్లిం, గౌడ మరియు కాపు సోదర, సోదరీమణులు నేను 1995 లో ఉయ్యూరు ఇండిపెండెంట్ సర్పంచ్ గా నిలబడితే అత్యధిక మెజార్టీ ఈ 5 వార్డుల ప్రజలు ఇచ్చారని, ఆ కృతజ్ఞతతోనే నేను గెలిచిన వెంటనే ముందుగా ఠాగూర్ గారి హాస్పటల్ రోడ్డు మొదలుకొని అన్నే బాబురావు గారి బజారు వరకు ఈ 5 వార్డులకు సంభందించి అన్ని రోడ్లని సిమెంట్ రోడ్లు వేసి, డ్రైన్లు కట్టించి ఉయ్యూరు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడినుంచే మొదలుపెట్టానని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. అదేవిధంగా 25 సంవత్సరాలు (సిల్వర్ జూబ్లీ) గా నేను పోటీ చేసిన అన్నిఎన్నికల్లో ఓటమి అనేదే లేకుండా నన్ను గెలిపించిన నా ఉయ్యూరు పట్టణ కుటుంబ సభ్యుల ఋణం తీర్చుకోలేనిదని, వీరందరూ నన్ను కుల మతాలకు, పార్టీలకు అతీతంగా వాళ్ళ ఇంటిలో సొంత బిడ్డవలె ఆదరిస్తారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అలాగే ఈ 18 వార్డుకి చెందిన సునోబా అనే మహిళకు కొండంత కష్టం వచ్చిందని, పాపం ఆమె భర్త చనిపోవడమేకాక, ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఏదో వేడినీళ్లకు చన్నీళ్ళు తోడుగా ఈ రోజు ఆమెకు ఆర్థిక సహాయం చేశామని, అలాగే ఈ ఇరువురి పిల్లల వైద్యం తక్కువ ఖర్చుతో అయ్యేవిధంగా నేను డాక్టర్లతో మాట్లాడి నా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ అందిస్తానని రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం లో అజ్మతుల్లా, సుబ్బారావు, నజీర్, lp రఫీ, జబ్బార్, షఫీ, జబి, కలిమా, సలీమ్,సల్మాన్, ఫణి, శ్రీనివాస్,పైడయ్య, నరేంద్ర, రవి, శ్రీను, నరేష్, అనిల్,అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles