ప్రజాసేవకే అంకితమై అందరివాడు అరవిందుడు అన్న బిరుదును గడించిన నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు పార్టీ కార్యాలయంలో మెట్రో టీవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో టివి తరపున, తన తరుపున, నరసరావుపేట నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మెట్రో టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మెట్రో టీవీ స్టాఫ్ రిపోర్టర్ పయ్యావుల శ్రీనివాస్, నరసరావుపేట మెట్రో టీవీ రిపోర్టర్ బాబు మరియు రొంపిచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి,ముండ్రు కోటేశ్వరరావు, పలువురు టీడీపీ కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
