తూర్పుగోదావరి జిల్లా (రాజమహేంద్రవరం)
రాజమహేంద్రవరంలో పలువురు ముస్లింలు తెదేపాలో చేరిక
వైకాపా పాలనలో మైనారిటీలపై దాడులు పెరిగాయని.. రాజమహేంద్రవరం తెదేపా ఎమ్మెల్యే, శ్రీమతి ఆదిరెడ్డి భవాని అన్నారు.
– ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 150మంది ముస్లింలు తెదేపాలో చేరారు.
★ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పలువురు ముస్లింలు తెదేపాలో చేరారు.
★ ఆజాద్ చౌక్‌లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆధ్వర్యంలో 150మంది మైనారిటీలు తెదేపాలో చేరారు.
★ తెదేపా హయాంలో మైనాటీల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేశారని.. ఎమ్మెల్యే భవానీ అన్నారు.
★ వైకాపా పాలనలో మైనారిటీలపై దాడులు పెరిగాయని.. వాటిని నియంత్రించాలన్నారు.
★ కొత్తగా పార్టీలోకి చేరిన వారందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు.