అమరావతి/రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం పార్లమెంటు టిడిపి నేతలతో టీడీపీ అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ వివరాలు..
పాల్గొన్న టిడిపి ప్రజాప్రతినిధులు, మండల పార్టీ బాధ్యులు
★ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
★ టిడిపి ప్రజాప్రతినిధులు, మండల పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.
★ ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే వైటి రాజా, ఇతర నాయకులు, కార్యకర్తలకు నివాళులు అర్పించారు.
👉 ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..
★ వైసిపి దాడులకు గురికాని వర్గం లేదు రాష్ట్రంలో..టిడిపిపై దాడులతో ప్రారంభించి అన్నివర్గాలపై దౌర్జన్యాలకు తెగబడ్డారు.
★ భౌతికదాడులు, ఆస్తుల విధ్వంసాలకు లెక్కేలేదు.
గతంలో ఎప్పుడో అడపాదడపా ఎక్కడైనా ఒకచోట అఘాయిత్యం జరిగేది.
★ ఇప్పుడు వైసిపి వచ్చాక అఘాయిత్యాలు లేని రోజే లేకుండాపోయింది.
★ అనపర్తిలో అరాచకాలకు అంతే లేదు.
★ రాజమండ్రిలో దళిత మైనర్ బాలికపై 12మంది సామూహిక అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ బైట వదిలేశారు.
★ రాజానగరంలో, రాజమండ్రి రూరల్ లో, నిడదవోలులో అన్నిచోట్ల అఘాయిత్యాలు, దౌర్జన్యాలే.
★ ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో కూడా పులివెందుల మార్క్ ఫాక్షనిజం తెచ్చారు.
★ వేధింపులు-బెదిరింపులు, దాడులు దౌర్జన్యాలు,
రాజోలులో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళిత యువకుడు వరప్రసాద్ కు శిరోముండనం…గుంటూరులో మట్టి మాఫియాను అడ్డుకున్న మౌజమ్ హనీఫ్ పై దాడి.. వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ..రాజమండ్రి ఎస్పీ కార్యాలయం ఎదుటే అబ్దుల్ సత్తార్ ఆత్మహత్యాయత్నం.. నకరికల్లులో ఎస్టీ మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపడం… ఆడబిడ్డలపై సామూహిక అత్యాచారాలు..ఏపి చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దురాగతాలు.
★ గిరిజన ఏజెన్సీలో సహజ వనరులు దోచుకుంటున్నారు.
★ బాక్సైట్ తవ్వకాల కోసం మళ్లీ ఇంకో అధికారుల కమిటి వేశారు.
★ 1/70 చట్టానికి తూట్లు పొడిచారు.
★ జీవో నెం 3 ప్రయోజనాలు కాపాడలేక పోయారు.
★ టిడిపి నాయకులు, కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేశారు, ఇళ్లు కూల్చేశారు, తోటలు నరికేస్తున్నారు. ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలు దెబ్బతీయడమే వైసిపి ఫాక్షనిజం.
★ ఏ వర్గానికి ఆ వర్గం ఎక్కడికక్కడ వైసిపి బాధిత జెఏసిలు ఎక్కువ అయ్యాయి.
★ అమరావతి పరిరక్షణ జెఏసి, ముస్లిం మైనారిటిల జెఏసి, దళిత సంఘాల జెఏసి, గిరిజన సంఘాల జెఏసి…వైసిపి బాధితులంతా జెఏసిలుగా ఏర్పడి జగన్ అరాచకాలపై పోరాటం చేస్తున్నారు.
వైసిపి ఇసుక మాఫియా ఆగడాలకు అంతే లేదు.
★ నదులపై బ్రిడ్జిల కింద, సమీపంలో ఇసుక తవ్వకాలు నిషిద్దం.
★ అలాంటిది ప్రసిద్దిగాంచిన రాజమండ్రి బ్రిడ్జి కింద, పక్కన ఇసుక రీచ్ లకు అనుమతులు ఇవ్వడం వైసిపి శాండ్ మాఫియా అరాచకాలకు పరాకాష్ట.
★ టిడిపి పాలనలో ఏట్లో ఇసుక ఉచితంగా దొరికేది, రవాణా ఛార్జీతో కలిపి రూ1,000కే ట్రాక్టర్ ఇసుక లభించేది, ఇప్పుడు రూ8వేలకు కూడా ట్రాక్టర్ ఇసుక దొరికే పరిస్థితి లేకుండా చేశారు.
★ ఒక్కో పథకం(స్కీమ్)లో 3రకాల అవినీతి… భూముల కొనుగోళ్లలో అవినీతి, మట్టి కప్పడంలో అవినీతి, ఇంటి పట్టాల పంపిణీలో వైసిపి వసూళ్ల దందాలు..ఇళ్లస్థలాల పంపిణీ స్కీములోనే వేలకోట్ల స్కామ్ చేశారు.
★ నవరత్నాలన్నీ అవినీతి మయం చేశారు.
★ పేదల సంక్షేమ పథకాల్లో కూడా వైసిపి నాయకులు అవినీతికి పాల్పడటం హేయం.
★ ప్రతి నియోజకవర్గంలో వైసిపి మద్యం మాఫియా పేట్రేగిపోతోంది.
★ జె ట్యాక్స్, వైసిపి ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ లతో దోచేస్తున్నారు.
★ నాసిరకం మద్యం అమ్మకాలతో ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు.
★ నాటుసారా ఏరులై పారుతోంది.
★ శానిటైజర్లు, కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా వైసిపి నాయకుల్లో స్పందనలేదు.
★ ఉన్మాది పాలనలో రాష్ట్రంలో ఉపద్రవాలన్నో చూస్తున్నాం.. గతంలో ఎప్పుడు జరగని అరాచకాలు చూస్తున్నాం.
★ మీటర్లు బిగిస్తే మెట్టరైతులు భూములు అమ్ముకోడం మినహా గత్యంతరం ఉండదు.
★ కరవు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి, 20హెచ్ పి, 30హెచ్ పి మోటార్లతో నీటిని ఎత్తిపోస్తారు.
★ చట్టప్రకారం హక్కులున్న అమరావతి రైతులకే జగన్మోహన్ రెడ్డి దారుణ మోసం చేశారు.
★ అలాంటిది పోరాడి సాధించుకున్న హక్కు ఉచిత విద్యుత్ కు మంగళం పాడేస్తున్నారు.
★ గతంలో మీటర్లు తీసేసి శ్లాబు విధానాన్ని ఎన్టీఆర్ తెచ్చారు.
★ ఇప్పుడు అప్పుల కోసం మళ్లీ మోటార్లకు మీటర్లు పెట్టడం రైతులకు జగన్ నమ్మకద్రోహం..
★ అసెంబ్లీ పోడియంలో బైఠాయిస్తేగాని ఇన్సూరెన్స్ ప్రీమియం విడుదల చేయరా..?
★ పోరాడి సాధించుకున్న ఉచిత విద్యుత్ రద్దు చేస్తారా..?
★ రైతుల మోటార్లకు మీటర్లు పెడతారా..?
★ ఇన్ పుట్ సబ్సిడిపై, సున్నావడ్డీపై అన్నీ అబద్దాలే..నోరుతెరిస్తే అబద్దం..
ఆ రోజు ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో చెప్పారా..? మీ మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టారా..?
★ సురక్షిత తాగునీరు ఇవ్వలేని వాళ్లకు పాలించే యోగ్యత ఉందా..?
★ ఉపాధ్యాయులను కూడా చివరికి రోడ్డెక్కిస్తారా..?
★ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియకు నాంది పలికింది టిడిపినే..పారదర్శకంగా జరిగే కౌన్సిలింగ్ లో వైసిపి జోక్యం ఎందుకు..?
★ చివరికి టీచర్ల బదిలీల్లో కూడా అక్రమ వసూళ్లకు పాల్పడతారా..?
★ ‘‘నాడు-నేడు’’ బిల్లులపై తప్పుడు లెక్కలతో ఉపాధ్యాయులను వేధిస్తారా..?
★ మీ వేధింపులతో ఉపాధ్యాయుల ప్రాణాలు తీస్తారా..?
★ ఇష్టారాజ్యంగా టీచర్ల బదిలీలు చేసి నాడు-నేడులో దోపిడి చేస్తారా..?
★ మద్యం అమ్మే క్యూల వద్ద టీచర్లను పెట్టి ఏం సందేశం ఇస్తారు..?
సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది ఎందుకు..? తన కేసుల మాఫీ కోసమా, రాష్ట్ర ప్రయోజనాల కోసమా..?
★ 10సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి జగన్ ఒరగబెట్టిందేమిటి..?
★ విశాఖ రైల్వే జోన్ కు నిధులు అడిగావా..?
★ కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో అడిగావా..?
★ విసిఐసి, బిసిఐసి ఏమయ్యాయో పట్టించుకోవా..?
★ పెట్రోలియం కాంప్లెక్స్ ఏమైందో ప్రశ్నించవా..?
★ తొలి ఏడాది ఆర్ధిక లోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు అడిగావా..?
★ అప్పుడు మెడలు వంచుతానని చెప్పి, ఇప్పుడు సాష్టాంగ దండ ప్రమాణాలా..?
జగన్మోహన్ రెడ్డి ఆ రోజేం చెప్పారు, ఈ రోజేం చేస్తున్నారు..?
★ ఆ రోజు రాష్ట్రంలో ఇసుక ఎలా ఉంది, ఈ రోజు ఏమైంది..?
★ ఆ రోజు మైనింగ్ ఎలా ఉంది, ఈ రోజు ఏం జరుగుతోంది..?
★ ఆ రోజు విపత్తుల్లో ఎలా ఆదుకున్నారు, ఇప్పుడేమైంది..?
★ ఆ రోజు పరిశ్రమలు ఎలా వచ్చాయి, ఇప్పుడెలా పెట్టుబడులు తరలిపోతున్నాయి..?
★ యువతకు అప్పుడెలా ఉద్యోగాలు కల్పించారు, ఇప్పుడెలా యువత నిర్వీర్యం అయ్యింది..?
★ అప్పట్లో బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల భద్రత ఎలా ఉంది, ఇప్పుడెలా దాడులు చేస్తున్నారు..?
★ ఆ రోజు ప్రజల ఆస్తులకు ఎలాంటి రక్షణ ఉంది, ఇప్పుడెలా కబ్జాలు చేస్తున్నారు..?
★ శాంతిభద్రతలు టిడిపి హయాంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడెలా క్షీణించాయి..?
★ అప్పుడు రాష్ట్రానికి ఎంత గౌరవం ఉంది, ఇప్పుడెలా చెడ్డపేరు తెచ్చారు..?
★ అప్పుడెలా అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేశారు, ఇప్పుడెలా ఒకే వర్గానికి అన్ని పదవులు కట్టబెడుతున్నారు..?
★ వీటన్నింటిపై ప్రజలే బేరీజు వేస్తున్నారు.
వైసిపి వచ్చాక సామాజిక న్యాయానికి పాతరేశారు.
★ 3జిల్లాలకో ఇన్ ఛార్జ్ గా నియమించిన 4గురు(సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి) ఒకే సామాజిక వర్గాలవాళ్లే..
★ యూనివర్సిటి పదవుల్లో, టిటిడి బోర్డులో, ఇతర పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో 800పైగా పదవులు ఒక్క సామాజికవర్గానికే కట్టబెట్టారు.
★ వైసిపిలో బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటి నాయకత్వాన్ని అణిచేస్తున్నారని వైసిపి ఎమ్మెల్యేల ఆడియోలే బైటపెట్టాయి.
★ బలహీన వర్గాల రాజ్యాధికారం టిడిపి సిద్దాంతం. రిజర్వేషన్లు కల్పించి బిసిలలో, మహిళల్లో నాయకత్వాన్ని పెంచింది ఎన్టీఆర్.
★ యానివర్సిటి స్థాయి నుంచి నాకు అండదండ బిసి, ఎస్సీ ఎస్టీ మైనారిటిలే..
★ సామాజిక న్యాయానికి ప్రతిరూపం తెలుగుదేశం.
★ వీసిల నియామకంలో సామాజిక న్యాయం చేశాం.
★ బిసిలకే పెద్దపీట వేశాం.
★ ఒకప్పుడు వద్దంటే స్థానిక ఎన్నికలు కావాలన్నారు.
★ ఇప్పుడు పెడ్తామంటే వద్దంటున్నారు.
★ జగన్ రెడ్డి వితండవాదం, ఓటమి భయం ఇక్కడే తెలుస్తోంది.
★ వ్యాక్సిన్ పంపిణీ వంకతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించాలని మరో జగన్నాటకానికి తెరలేపారు.
★ డిసెంబర్ 25నుంచి కోటిమందికి వ్యాక్సిన్ పంపిణీ అంటూ దొంగట్వీట్లు పెడుతున్నారు.
★ నిష్పాక్షికంగా స్థానిక ఎన్నికలు జరిగితే ఓటమి భయం వైసిపికి వెన్నాడుతోంది.
★ అందుకే వ్యాక్సిన్ పంపిణీ నాటకాన్ని తెరపైకి తెచ్చారు.
★ స్థానిక ఎన్నికలకు టిడిపి నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలి.
★ గతంలో వైసిపి దాడులు, దౌర్జన్యాలకు తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.
★ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో టిడిపి గెలుపే వైసిపి దుర్మార్మాలకు అడ్డుకట్ట.
★ బాధిత బిసి, ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలంతా ఏకమై వైసిపికి బుద్ది చెప్పాలి.
★ జమిలి ఎన్నికలు మరో ఏడాదిన్నరలో వస్తాయని అంటున్నారు.
★ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపి శ్రేణులంతా సంసిద్దంగా ఉండాలి.
★ వంద మందికి 5గురు మారితే వైసిపి ఇంటికే..మంద మెజారిటి ఉందని విర్రవీగితే ప్రజలే బుద్ది చెబుతారు.
★ బాధిత ప్రజలంతా ఏకమై తిరగబడితే వైసిపి తోక ముడవడం ఖాయం.
★ వైసిపి బాధిత ప్రజానీకానికి టిడిపి శ్రేణులంతా అండగా ఉండాలి.
★ టిడ్కో ఇళ్ల కోసం పేదల పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
★ అటు ఇన్సూరెన్స్ కోల్పోయి, ఇటు ఇన్ పుట్ సబ్సిడి అందక విపత్తుల్లో సర్వం కోల్పోయిన రైతులకు అండగా ఉండాలి.
★ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని అడ్డుకోవాలి.
వైసిపి దాడులు దౌర్జన్యాలను ధైర్యంగా ఉక్కు సంకల్పంతో ఎదుర్కొని ముందడుగువేస్తున్న టిడిపి కార్యకర్తలకు అభివందనలు.
★ రెట్టించిన స్ఫూర్తితో టిడిపి నాయకులంతా కలిసికట్టుగా పోరాడాలి.
★ పోరాటం చేసేవాళ్లకే ప్రజల్లో ఆదరణ. పోరాడేవాళ్లనే హీరోలుగా ప్రజలు అభిమానిస్తారు.
★ శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా దుర్మార్గాలపై ధ్వజమెత్తాలి.
★ వైసిపి బాధిత ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం మైనారిటి వర్గాల ప్రజలకు అండగా ఉండాలి.
★ భవిష్యత్తుపై వారిలో భరోసా పెంచాలని చంద్రబాబు పేర్కొన్నారు.
👉 టిడిపి నాయకుల ప్రసంగాలు:
👉 అచ్చెన్నాయుడు:
★ ప్రజల పట్ల బాధ్యతగల పార్టీ తెలుగుదేశం అయితే బాధ్యతారహిత పార్టీ వైసిపి.. ఏడాదిన్నరలో జగన్మోహన్ రెడ్డి పాలనా నిర్వాకాలే అందుకు నిదర్శనం.
★ 34వేల ఎకరాల భూములను రాజధానికి త్యాగం చేసిన రైతులను రోడ్డెక్కించారు.
★ జగన్ రెడ్డి అసమర్ధత వల్లే పోలవరం కూడా సంక్షోభంలో పడింది.
★ ఎటువంటి విపత్తు వచ్చినా నాయకుడిగా చంద్రబాబు బాధిత ప్రజలను ఆదుకుంటే, జగన్ రెడ్డి విపత్తుల్లో బాధితులను గాలికి వదిలేయడం అందరూ చూశారు.
★ జగన్ రెడ్డి చెప్పేదానికి చేసేదానికి పొంతనే లేదు. ఇన్సూరెన్స్ రూ1300కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు, జిల్లాలకు విడుదల చేసింది రూ900కోట్లే అని సాక్షి యాడ్స్ బైటపడింది.
★ చనిపోయిన, దాడులకు గురైన మన కార్యకర్తలను పలకరించుకోడానికి కూడా వీల్లేని పరిస్థితులు రాష్ట్రంలో వైసిపి దౌర్జన్యకాండకు నిదర్శనాలు.
★ అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను.
★ నిరంతరం పార్టీ పనిలోనే నిమగ్నం అయ్యాను.
★ వైసిపి ప్రతి బాధితుడికి అండగా ఉంటాను, అందరూ మనోధైర్యంతో పోరాడాలి.
★ వైసిపి చేతిలో మోసపోయిన బాధిత వర్గాలన్నీ తిరగబడ్తున్నాయి.
★ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నాయి.
★ వైసిపి బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంఘీభావంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు నిలబడాలి.
👉 జవహర్ (మాజీమంత్రి):
★ గతంలో జుట్టుపన్ను వేసిన పాలకులను జగన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.
★ రోడ్డుపై నడిస్తే, వీథి దీపాలపై, మరుగుదొడ్లపై పన్నులు వేస్తున్నారు.
★ ఎడాపెడా పన్నులతో ప్రజలపై వేల కోట్ల భారాలు మోపారు.
★ పదిమందికి విద్యాబుద్దులు చెప్పే ఉపాధ్యాయులను కూడా వైసిపి నాయకులు వేధిస్తున్నారు.
★ ‘‘నాడు- నేడు’’లో వైసిపి నాయకుల వేధింపులతో టీచర్ల ప్రాణాలు కూడా తీస్తున్నారు.
★ డిఏలు పిఆర్సీ ఊసే గాలికి వదిలేశారు.
★ సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి ఇప్పటికి 75వారాలు దాటినా అతీగతీ లేదు.
👉 గోరంట్ల బుచ్చయ్య చౌదరి (ఎమ్మెల్యే):
★ జగన్ రెడ్డి నిర్వాకాలతో గోదావరి డెల్టా మనుగడకే పెను ప్రమాదం ముంచుకొస్తోంది.
★ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41మీటర్లకే తగ్గింపు, 31మీటర్లపై ఎత్తిపోతలు పెట్టి డెడ్ స్టోరేజి వాటర్ కూడా తోడేస్తామనడం డెల్టా మనుగడనే ప్రమాదంలోకి నెడ్తున్నాడు.
★ రెండో పంటకు నీళ్లు లేకుండా చేస్తున్నాడు.
★ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ యధేచ్చగా చేస్తున్నారు.
★ ఆ రోజున టిడిపిపై అపవాదులు వేశారు. ఇప్పుడు వైసిపి వచ్చాక ఇసుక దొరకడమే గగనం అయ్యింది.
★ లక్షలాది భవన నిర్మాణ కార్మికుల జీవనోపాధికి గండికొట్టారు, వాళ్ల కుటుంబాలను నడిరోడ్డుపైకి నెట్టారు.
★ మెరకల పేరుతో రాజమండ్రి పరిధిలోనే రూ15కోట్లు దోపిడికి పాల్పడ్డారు.
★ ఇక భూకొనుగోళ్లలో కుంభకోణాలకు, ఇళ్లస్థలాల పేరుతో అక్రమ వసూళ్లకు అంతే లేదు.
👉 ఆదిరెడ్డి భవాని (రాజమండ్రి ఎమ్మెల్యే):
★ నిర్మాణానికి చంద్రబాబు నిదర్శనం అయితే, విధ్వంసానికి జగన్ రెడ్డి ప్రతిరూపం.
★ జగన్ సిఎం అయ్యాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసమే…అన్నిచోట్లా అరాచకాలు, అఘాయిత్యాలు, అమానుష కాండే..
★ చంద్రబాబు ఇమేజ్ తో అనేక పరిశ్రమలు ఏపికి వస్తే, జగన్ ఇమేజ్ దెబ్బకు అవన్నీ తరలిపోయాయి.
★ అభివృద్ది- సంక్షేమం 2కళ్లుగా చంద్రబాబు దృష్టి వుంటే, విధ్వంసం-వినాశనమే 2కళ్లుగా జగన్ దృష్టి ఉంది.
★ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు ఆరాట పడితే, ఆంధ్రప్రదేశ్ ను అధ: పాతాళంలోకి దిగజార్చడమే జగన్ లక్ష్యం.
👉 రామకృష్ణారెడ్డి (అనపర్తి మాజీ ఎమ్మెల్యే):
★ వైసిపి నాయకుల అవినీతి, అరాచకాలు అనపర్తిలో తారాస్థాయికి చేరాయి.
★ అనపర్తి కాకినాడ ఎమ్మెల్యేలు ఇద్దరూ కుమ్మక్కై రూ400కోట్ల గ్రావెల్ స్కామ్ కు పాల్పడ్డారు.
★ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
★ నాటుసారాకు దళిత యువకుడు లోవరాజు బలయ్యారు.
★ వైసిపి వేధింపులు తట్టుకోలేక మరో యువకుడు ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు.
★ స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేసిందన్న అక్కసుతో దళిత మహిళ భాగ్యలక్ష్మిని వేధించడం, 20రోజుల్లో 2ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఆమెకు రక్షణగా నిలిచిన నాపై తప్పుడు కేసులు 6 పెట్టడం, నాపై, నా వాహనంపై దాడి చేయడం వైసిపి దుర్మార్గ పాలనకు నిదర్శనం..టిడిపి కార్యకర్తలపై 81కేసులు పెట్టారు.
★ బాధితులంతా న్యాయస్థానాలకు వెళ్లి రక్షణ పొందాల్సిన దురవస్థ ఏర్పడింది.
👉 పెందుర్తి వెంకటేష్ (రాజానగరం మాజీ ఎమ్మెల్యే):
★ ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తే అక్రమ కేసులు పెడ్తున్నారు.
★ నాపై కూడా తప్పుడు కేసులు 6 బనాయించారు.
★ ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా కుంభకోణాల్లో కత్తిపోట్ల దాకా వైసిపి వాళ్లు వెళ్లారు.
★ వైసిపి పాలనలో ప్రతి కార్యక్రమం అవినీతిమయం.
★ అవినీతిని ప్రశ్నించిన వారిపై దాడులు దైనందిన కార్యక్రమాలు అయ్యాయి.
👉 జుట్టుక సూర్యకుమారి (అనపర్తి టిడిపి మహిళా నేత):
★ ఒక నాయకుడి పరిపాలన కాకుండా ఒక గుండా పాలన ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం.
★ మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు, ఇలాంటి అమానుషాలు ఏపి చరిత్రలో చూడలేదు.
★ బైటకెళ్లిన ఆడబిడ్డ క్షేమంగా తిరిగివస్తుందనే ధీమా లేకుండా చేశారు.
★ మహిళా రక్షకుడిగా చంద్రబాబు ఉంటే మహిళా భక్షకుడిగా జగన్ రెడ్డి మారారు.
★ మహిళా సంక్షేమం కోసం టిడిపి పాటుబడితే, మహిళా వేధింపులే వైసిపి అజెండాగా మారాయి.
👉 గన్ని కృష్ణ:
★ అసెంబ్లీలో మీ సహనానికి హ్యాట్సాఫ్..మీపై వైసిపి నాయకుల దుర్భాషలు విని మా రక్తం ఉడికిపోతోంది.
★ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ గొంతునే నొక్కడం వైసిపి దుర్మార్గానికి ప్రత్యక్ష సాక్ష్యం.
★ క్రాప్ ఇన్సూరెన్స్ కోసం పోడియంలోనే మీరు బైఠాయించడం రైతుల్లో భరోసా పెంచింది.
👉 ఆదిరెడ్డి అప్పారావు (మాజీ ఎమ్మెల్సీ):
★ 18నెలల్లో వేలకోట్ల ప్రజాధనం స్వాహా చేశారు.
★ బూరుగుపూడి, కాపవరం ఆవభూముల్లో స్వాహా చేసిన రూ400కోట్లు అక్రమార్కుల నుంచే రికవరీ చేయాలి.
★ ప్రభుత్వ భవనాలకు రంగుల్లో దుర్వినియోగం చేసిన రూ3వేల కోట్లు వైసిపి నుంచే రికవరీ చేయాలి.
★ మళ్లీ వైసిపి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ను అమ్మేస్తారు, రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలనూ అమ్మేస్తారు.
👉 ఎం వెంకటేశ్వర రావు (మాజీ ఎమ్మెల్యే):
★ ఎకరం రూ20లక్షల భూమిని రూ60లక్షలకు కొనిపించి 3రెట్ల ప్రజాధనం స్వాహా చేశారు.
★ మెరక పేరుతో వందల కోట్ల స్కామ్ లు చేశారు.
★ టిడిపి ఉచితంగా ఇచ్చిన ఎర్రకాలువ ఇసుకను కూడా అమ్ముకుని వైసిపి నాయకులు జేబులు నింపుకుంటున్నారు.
★ నాతో సహా అనేకమంది సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు.
★ వైసిపి వేధింపు బాధితులే ఆపార్టీకి తగిన బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారు.
ఈ సమావేశంలో రాజమండ్రి పార్లమెంటు ఇన్ ఛార్జ్ గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, ఎం వెంకటేశ్వర రావు, శిరసపల్లి నాగేశ్వరరావు,కొల్లా రత్నం, రొంగల శ్రీనివాసరావు, మార్గాని సత్యనారాయణ, ఎం వాసుదేవ రావు, వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, సింహాద్రి రామకృష్ణ, ముమ్మడి వీర వెంకట సత్యనారాయణ, బూరుగుపల్లి వీర రాఘవులు,సూరపని చిన్ని తదితరులు ప్రసంగించారు.