రాజేంద్ర నగర్ లో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే – రాజేంద్ర ప్రసాద్
ఉయ్యూరు మున్సిపాల్టీ 4 వార్డులో వివాహం చేసుకుంటున్న రాజేంద్ర నగర్ కి చెందిన అబ్దుల్ రహీమ్ కూతురుకి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్
ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉయ్యూరు పట్టణ ప్రజలకు నాకు ఉన్న ఆత్మీయ సంబంధం ఎవ్వరు విడతీయరానిదని, అలాగే ఈ రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి సుమారు 400 ల కుటుంబాలు నన్ను కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఎంతగానో అభిమానిస్తారని, ఎందుకంటే 2003 లో రాజేంద్ర నగర్లో అగ్ని ప్రమాదం జరిగి ఇళ్ళు అన్ని కాలిపోతే నేను వివిధ స్వచ్చంద సంస్థల ద్వారా వీళ్ళకి 125 పక్కా గృహాల్ని, బాత్రూం లెట్రిన్ లతో సహా ఒక్క రూపాయి కూడా బాధితులవి పడకుండా నిర్మించి ఇచ్చానని ,అందుకే వీళ్ళందరూ నన్ను వాళ్ళ కుటుంబంలో ఒక్కడిగా సొంత బిడ్డలాగా అభిమానిస్తారని, నేను కూడా వీళ్లకు ఎప్పుడు ఏ కష్టం, నష్టం వచ్చినా ఆదుకొని సేవ చెయ్యడం నా బాధ్యతగా భావిస్తానని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. అదేవిధంగా నేను 25 సంవత్సరాలుగా 1995 నుంచి 2020 వరకు (సిల్వర్ జూబ్లీ) రాజకీయంగా వరుసగా పోటీచేసిన అన్ని ఎన్నికల్లో ఓటమి అనేదే లేకుండా నన్ను గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఉయ్యూరు పట్టణ ప్రజలందరి ఋణం తీర్చుకోలేనిదని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు.
రాజేంద్ర నగర్‌కు చెందిన sc దళిత నేత చేదుర్తి పాటి ప్రవీణ్ మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ గారు 2003 లో ఉయ్యూరు మండల జడ్పీటీసీగా మరియు వారి సతీమణి శ్రీమతి భ్రమరాంబ గారు ఉయ్యూరు సర్పంచ్ గా ఉండగా మా రాజేంద్ర నగర్ అగ్ని ప్రమాదానికి గురైతే మా అందర్నీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆదుకొని మాకు 20 రోజుల పాటు ఆహారం, త్రాగునీరు అందించడమే గాక మాకు రూపాయి ఖర్చు కాకుండా 125 డాబా ఇళ్లను నిర్మించి సిమెంట్ రోడ్లు, కరెంట్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ వేయించి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసారని, అలాగే మా రాజేంద్ర నగర్ లోని ప్రజలకు ఏ కష్టం, నష్టం వచ్చినా వెంటనే ఆదుకుంటారని,అందుకనే మేమంతా కలసి ఈ కాలనికి రాజేంద్ర నగర్ అని ఆయన పేరు పెట్టుకున్నామని ప్రవీణ్ అన్నారు.
ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు గుర్నాధరావు, సుబ్బారావు, అజ్మతుల్లా, ఫణి, శ్రీనివాస్, నజీర్, అంజి, భాస్కర్,సాంబశివరావు, యం.జి రవి,అప్పలనాయుడు, నరేంద్ర మరియు రాజేంద్ర నగర్ యువత, మహిళలు పాల్గొన్నారు.