అమరావతి (చిత్తూరు జిల్లా/కుప్పం)
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సంఘ విద్రోహ శక్తులు చేస్తున్న ఎన్నికల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు లేఖ
కుప్పం, గుండేపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని 41 గ్రామ పంచాయితీలలో సంఘవిద్రోహ శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నాయి.
★ జిల్లా క్రాంగ్రెస్ (డిసిసి) అధ్యక్షుడు సురేష్ బాబు పై హత్యాయత్నానికి పాల్పడ్డారు.
★ ప్రతిపక్ష నాయకులపై, కార్యకర్తలపై దాడలకు పాల్పడుతూ బయభ్రాంతులకు గురిచేస్తున్నారనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ.
★ ఇలాంటి అనేక సంఘటనలు నా దృష్టికి వచ్చాయి.
★ కుప్పంలో సంఘ విద్రోహ శక్తులు తిష్టివేసి గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అవరోధం సృష్టించాలని చూస్తున్నాయి.
★ కుప్పంలో ఫిబ్రవరి 17న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
★ సంఘవిద్రోహ శక్తులను వెంటనే నియోజకవర్గం నుంచి బయటకు పంపి శాంతిభద్రతలను కాపాడాలి.
★ సంఘవిద్రోహ శక్తులు కుప్పంలో చేస్తున్న అరాచకాలుపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోండి.
అమరావతి (గుంటూరు జిల్లా/నరసరావుపేట)
ప్రజలు ప్రత్యర్థిని గెలిపిస్తే వారిపై పగబట్టి, వారి వ్యక్తిగత ఆస్తులను కూల్చుతారా?
– తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు..
★ నరసరావుపేట నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, ఇస్సాపాలెం పరిధిలో వైసీపీకి ఓటు వెయ్యలేదని ఇళ్ల ముందు ఉండే డ్రైనేజీ మెట్లు, ర్యాంపులను పంచాయితీ సెక్రెటరీ మరియు పోలీస్ అధికారులు దగ్గరుండి కూలగొట్టించడం దారుణం.
★ ఇలాంటి ఆటవిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.
★గోగులపాడు పంచాయతీ 5వ వార్డులో తెలుగుదేశం బలపరచిన అభ్యర్థి గెలిచినందుకు వైసీపీ ప్రభుత్వం తీర్చుకున్న ప్రతీకారం ఇది.
★ ప్రజలు ప్రత్యర్థిని గెలిపిస్తే వారిపై పగబట్టి, వారి వ్యక్తిగత ఆస్తులను కూల్చుతారా?
★ ఇలాంటి రాజకీయాన్ని రాజారెడ్డి రాజ్యాంగం నేర్పిందా?