అనంతపురం నగరంలోని రంగనాథస్వామి లో వడ్డెర సంఘం కార్యాలయం నందు వడ్డెర సంఘం జిల్లా నాయకులు పెద్ద మారెప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ, దళవాయి వెంకటయ్యా, నాయకులు డేరంగుల బలంకన్న,కుమార్,వద్దే వెంకటేష్ ఆధ్వర్యంలో వడ్డెరల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి కుమారుడు మధు హాజరయ్యారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవర్ల మురళి నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సత్యపాల్ కమిటీ ఏర్పాటు చేసి జీవో జారీ చేసింది ఆనివేదిక ఆధారంగా ప్రస్తుత వైకాపా ప్రభుత్వం వడ్డెరలను ఎస్టీ జాబితాలో తక్షణమే చేర్చాలని డిమాండ్ చేశారు ఆదరణ పథకాన్ని పుణ రుద్దించలని అన్నారు కింద క్వరిలలో లీజులు లేకుండా కేటాయించాలని అలాగే వడ్డెర చేతి వృత్తి దారులకు ప్రమాద బీమా వర్తింప చేయాలని అన్నారు ఇందులో వడ్డెర నాయకులు మాట్లాడుతూ దేవళ్ళ మురళి గారికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మధు మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో వడ్డెర కులస్తుల కోసం ఎంతో కృషి చేశామని అన్నారు అదే విధంగా టీడీపీ పాలనలో అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో నగరంలో వడ్డెర కులస్తులకు 5 సీట్లు కేటాయించేందుకు మా నాన్న గారితో చర్చిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సరిపుటి రమణ, వడ్డెర సంఘం కోశాధికారి కుంచపు వెంకటేష్, మాజీ డైరెక్టర్ నారాయణ స్వామి యాదవ్, టీడీపీ మహిన నాయకురాలు విజయ శ్రీ, వడ్డే భవాని, వెంకటేష్,గోవిందు, వన్నురు,రఘు,రామచంద్ర,ఆదినారాయణ,తదితరులు పాల్గొన్నారు

