ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం 53 డివిజన్ టీడీపీ బలపర్చిన సీపీఐ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ D.V. రమణ బాబు, డివిజన్ టీడీపీ అధ్యక్షులు శ్రీ మరుపిళ్ళ తిరుమలేష్ గారు,టీడీపీ శ్రేణులతో కలసి కోమలవిలాస్ సెంటర్ నుండి ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్(నాని) గారు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని గారు మీడియా తో మాట్లాడుతూ
●100 సం౹౹రాలు చరిత్ర కలిగిన కనకదుర్గమ్మ వారి సంపదను మంత్రి వెల్లంపల్లి, ఈఓలు దోచేశారు
●ఈరోజు CID, ACB ఎంక్వైరీ వేసి తూతూమంత్రంగా సోదాలు చేస్తేనే 100 కోట్ల అవినీతి తేలింది.
●శాఖకు సంబంధించిన మంత్రి,ఈఓ లకు తెలియకుండా100ల కోట్లు కుంభకోణం ఎలా జరిగిందని జగన్ మోహన్ రెడ్డి ని ప్రశ్నించారు.
●కనక దుర్గమ్మ గుడి లో జరిగిన అవినీతి పైన తెలుగుదేశం పార్టీ తరుపున CBI ఎంక్వయిరీ కోరుతున్నాము.
●మంత్రి వెల్లంపల్లి, ఈఓ లను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
●కొన్ని నెలల్లోనే 100 కోట్లు సంపాదించిన వెల్లంపల్లి పైన CBI ఎంక్వయిరీ వేయాలి.
●పశ్చిమ నియోజకవర్గం లో మంత్రి రోడ్డు పైన గుంత కూడా పూడ్చలేదు.
●విజయవాడ నగరానికి కనకదుర్గమ్మ, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ లు వేసి నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేశాము.
●విజయవాడ నగరానికి స్ట్రమ్ వాటర్ డ్రైనేజి కోసం 480 కోట్లు కేంద్రం నుండి తీసుకొని వచ్చి వరదల రహిత నగరం గా అభివృద్ధి చేశాము.
● దేవాలయాల హుండీలు కన్నా మంత్రి వెల్లంపల్లి హుండీ ముందు నిండుతుంది.
●కేంద్రం నుండి గతంలో కంటే రెట్టింపు నిధులు తీసుకువచ్చి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
●ఇంటిపన్నులు, నీటిపన్నులు, డ్రైనేజీ పన్నులు 5 రేట్లు పెంచుటకు వైసీపీ ప్రభుత్వం సిద్ధం గా ఉంది.
●విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పైన ఆర్ధికభారం పడకుండా మునిసిపల్ ఉద్యోగుల జీతాలు 010 పద్దు ద్వారా ప్రతి నెల సకాలంలో చెల్లించడం జరిగిందన్నారు.
●విద్యుత్ చార్జీలు పెంచి రేషన్ కార్డులు తొలిగిస్తున్నారన్నారు.